ప్చ్.. రోహిత్ ఖాతాలో చెత్త రికార్డ్?

praveen
గత కొన్నేళ్ల నుంచి ఐసీసీ నిర్వహించే వరల్డ్ కప్ టోర్నీలలో భారత జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసి అదరగొడుతుంది. కానీ ఎందుకో టైటిల్ మాత్రం గెలవలేక పోతుంది. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన ప్రపంచకప్ టోర్నీలో కూడా ఇదే జరిగింది అన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు మించి రాణించింది. ఒక్క ఓటమి లేకుండా వరుస విజయాలు సాధిస్తూ అటు ఫైనల్ వరకు దూసుకు వెళ్ళింది. దీంతో ఇక టీమ్ ఇండియా జోరు చూసి టైటిల్ గెలవడం ఖాయం అని అందరూ అనుకున్నారు.

 కానీ ఊహించని రీతిలో కీలకమైన ఫైనల్ పోరులో మాత్రం టీమిండియా తడబాటుకు గురైంది. దీంతో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి టైటిల్ ను చేజార్చుకుంది. కానీ ఇప్పుడు వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో ఎలాంటి తప్పిదాలు చేయకుండా.. జాగ్రత్త పడుతుంది. వరుస  విజయాలు సాధిస్తూ అదరగొడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే లీగ్ దశలో వరుసగా నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించి సూపర్ 8 లో అర్హత సాధించిన టీమిండియా.. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోను అద్భుతమైన ప్రదర్శన చేసి 47 పరుగులు తేడాతో విజయాన్ని సాధించింది.

 అయితే భారత జట్టు వరుస విజయాలు సాధిస్తున్న జట్టులోని కీలక ప్లేయర్లు మాత్రం వరుసగా విఫలం అవుతూ ఉండడం అందరిని ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో కూడా 8పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ మరోసారి నిరాశ పరిచాడు. దీంతో అతని ఖాతాలో ఒక చెత్త రికార్డు చేరిపోయింది. టి20 వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే పరిమితమైన బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ నిలిచారు. ఆఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో 8 పరుగులు మాత్రమే చేశాడు. తర్వాత యువరాజ్ సింగ్ 8 సార్లు, సురేష్ రైనా ఏడుసార్లు, గౌతమ్ గంభీర్ 5 సార్లు, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు ఐదుసార్లు t20 వరల్డ్ కప్ లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన ప్లేయర్లుగా కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: