RCB ఓడిన.. కోహ్లీ సాధించిన రికార్డు ఎవరు పట్టించుకోవట్లేదే?
కానీ ఊహించని రీతిలో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన కోహ్లీ సేన.. అటు కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయి చివరికి ఇక ఐపీఎల్ టోర్ని నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక వరుస పరాజయాలతో సతమతమై పాయింట్ల పట్టికలో చివరన కొనసాగిన ఆర్సిబి ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్ కి అర్హత సాధించింది. ఆ తర్వాత మాత్రం ఎలిమినేటర్ మ్యాచ్లో సత్తా చాట లేకపోయింది. దీంతో జట్టు అభిమానులు అందరూ కూడా తీవ్ర నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి.
అయితే ఇలా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఓడిపోయింది అన్న బాధలో విరాట్ కోహ్లీ సాధించిన ఒక అరుదైన రికార్డును మాత్రం అభిమానులు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఐపీఎల్ చరిత్రలో 8000 పరుగులు పూర్తి చేసుకున్న ఏకైక ప్లేయర్గా విరాట్ కోహ్లీ నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు ఇక ఐపీఎల్ కెరియర్ లో విరాట్ కోహ్లీ 8 సెంచరీలు 55 అర్థ సెంచరీలు నమోదు చేశాడు. పరుగులపరంగా కోహ్లీ దరిదాపుల్లో కూడా ఏ ప్లేయర్ లేకపోవడం గమనార్హం. ఆ తర్వాత స్థానంలో శిఖర్ ధావన్ 6769 పరుగులతో ఉన్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ ఈ సీజన్లో లీడింగ్ స్కోరర్ గా కూడా ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు అని చెప్పాలి.