ఆయనను ఒప్పించే బాధ్యతను.. ధోనీకే అప్పచెప్పిన బీసీసీఐ?

praveen
ప్రస్తుతం భారత జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ పదవి కాలం ఎప్పుడో ముగిసింది. అయినప్పటికీ ఇక బిసిసిఐ స్పెషల్ రిక్వెస్ట్ తో ఆయన ఇప్పటికీ కూడా హెడ్ కోచ్ పదవీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ కావాలి అంటూ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే భారత జట్టుకు కోచ్గా పని చేసే వ్యక్తికి ఇచ్చే శాలరీతోపాటు ఇక పూర్తి అలవెన్స్ ల వివరాలను కూడా సోషల్ మీడియాలో ప్రకటించింది.

 ఈ క్రమంలోనే టీమ్ ఇండియాకు కొత్త హెడ్ కోచ్గా రాబోయేది ఎవరు అనే విషయంపై చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి . అయితే ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ గా వ్యవహరిస్తున్న స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇక టీమిండియా హెడ్ కోచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ను ఎంతో విజయవంతంగా ముందుకు నడిపించడంలో సక్సెస్ అయినా కోచ్ ఫ్లెమింగ్ అటు టీమిండియా కు సరైన కోచ్ అంటూ ఎంతో మంది అభిప్రాయపడుతున్నారు. అయితే తప్పనిసరిగా ఫ్లెమింగ్ ను హెడ్ కోచ్ గా తీసుకురావాలని అనుకుంటుందట  బీసీసీఐ.

 ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్ పదవికి స్టీఫెన్ ఫ్లెమింగ్ ను ఒప్పించే బాధ్యతను బీసీసీఐ ధోనీకి అప్పగించినట్లు తెలుస్తుంది  2008లో చెన్నై సూపర్ కింగ్స్ కోచ్గా ఫ్లెమింగ్ చేరినప్పటి నుంచి ధోనికి ఆయనతో సన్నిహిత సంబంధం ఉంది  పైగా ఆయన శిక్షణలో చెన్నై సూపర్ కింగ్స్ 5 ఐపీఎల్ టైటిల్స్ కూడా సాధించింది. ఈ రీజన్ తోనే స్టీఫెన్ ఫ్లెమింగ్ ని ఒప్పించే బాధ్యతలను  బీసీసీఐ ధోని భుజాలపై పెట్టినట్లు టాక్   అయితే త్వరలోనే దీనిపై క్లారిటీ రాబోతుంది. కాగా అటు గౌతమ్ గంభీర్, రికీ పాంటింగ్ కూడా కోచ్ పదవి చేపట్టేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: