వచ్చే ఏడాది.. ధోని ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడు : రాయుడు

praveen
2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నాటి నుంచి కూడా మహేంద్రసింగ్ ధోని అభిమానులు అందరిలో కూడా ఒకే విషయంపై చర్చ జరుగుతూ వస్తుంది. అదే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజనా కాదా అనే విషయంపై. గత కొంతకాలం నుంచి ఇదే విషయంపై చర్చ జరుగుతున్నా.. ధోని మాత్రం ప్రతి సీజన్లో కూడా ఐపీఎల్ లో కొనసాగుతూ వస్తున్నాడు. అయితే 2024 సీజన్ కి ముందు మాత్రం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయ్.

 చెన్నై జట్టుకి వ్యవహరించిన  ధోని సారధ్య బాధ్యతలు నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా యువ ఓపెన్ రుతురాజు గైక్వాడ్ చేతికి కెప్టెన్సీ అప్పగించాడు అని చెప్పాలి. కీలక ఆటగాడిగా మాత్రమే కొనసాగాడు. ఇక దానికి తోడు చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అయిన చపాక్ స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడిన సమయంలో ఇక స్టేడియం చుట్టూ తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశాడు. ఇదంతా చూసి  ఇక ధోని కి ఇదే చివరి ఐపిఎల్ అని టోర్ని ముగిసిన వెంటనే ఐపిఎల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తారని అందరూ భావించారు.  ఇక అభిమానులందరూ కూడా ఇదే విషయంపై ఆందోళన చెందుతున్నారు.

 అయితే ధోని వచ్చే ఐపిఎల్ సీజన్ ఆడతాడా లేదా అనే విషయం కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే అదే విషయంపై స్పందించిన సీఎస్కే మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని వచ్చే ఏడాది కూడా తప్పకుండా ఆడతాడు అంటూ ధీమా వ్యక్తం చేశాడు. చెన్నైని క్వాలిఫైయర్స్ కు తీసుకెళ్లాలని ఎంఎస్ ధోని భావించి ఉంటారని.. ఆ మ్యాచ్లో ఔటర్ అయ్యాక కనిపించినంత నిరుత్సాహంగా మునుపెన్నుడు ఆయన కనిపించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ద్వారా ధోనినీ వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ లో చూడొచ్చు. అందుకే బీసీసీఐ వచ్చే సీజన్లో కూడా ఈ రూల్ ని కొనసాగించాలి అంటూ అంబటి రాయుడు కోరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: