వర్షం పండిందా.. ఆ జట్టు పని గోవిందా?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోరు ప్రస్తుతం మరింత రసవత్తరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్లే ఆఫ్ లో అడుగుపెట్టిన మూడు జట్లు ఏంటి అన్న విషయంపై క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే నాలుగో స్థానం కోసం రెండు జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది అని చెప్పాలి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఇక ఐదువ స్థానంలో కొనసాగుతుంది. చెన్నై, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు మధ్య ఇక నాలుగో స్థానం కోసం పోటీ జరుగుతుంది. ఈ రెండు టీమ్స్ లో ఏ టీం ఇక ప్లే ఆఫ్ లో అడుగుపెడుతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లాగే ఉండబోతుంది అని చెప్పాలి. ఎందుకంటే గెలిచిన జట్టు ముందుకి ఓడిన జట్టు ఇంటికి వెళ్లబోతున్నాయి. ఇక ఈ రెండు టీమ్స్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం అటు ఐపీఎల్ ఫ్యాన్స్ అందరు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ఫై వర్షం ముప్పు పొంచి ఉంది అన్న విషయం తెలిసిందే.ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ప్లే ఆఫ్ కు ఏ జట్టు అర్హత సాధిస్తుంది అన్నది అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న.

 మే 18వ తేదీన ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో అటు బెంగళూరు టీం చెన్నై ని ఓడించడమే కాదు.. విక్టరీ మార్జిన్ కూడా ఎక్కువగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు కనీసం 18 పరుగులు తేడాతో గెలవాలి. ఆ తర్వాత బ్యాటింగ్ చేస్తే 18.1 ఓవర్ లలో 180 పరుగుల లక్ష్యాన్ని చేదించాలి. ఇలా జరిగితేనే ఆర్సిబి నెట్ రన్ రేట్ చెన్నై సూపర్ కింగ్స్ కంటే మెరుగ్గా ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్లే ఆఫ్ లో అడుగు పెట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం.. ఆర్సిబి, చెన్నై మధ్య జరగబోయే మ్యాచ్ సమయంలో.. బెంగళూరులో వర్షం పడే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కి అర్హత సాధిస్తుంది. ఇక మరోసారి బెంగళూరు టీం కి నిరాశ తప్పదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: