కోహ్లీ వల్లే వరల్డ్ కప్ ఫైనల్ ఓడిపోయాం.. సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్?

praveen
మరి కొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ టోర్ని ప్రారంభం కాబోతుంది. ఇక ఇప్పటికే బీసీసీఐ వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను కూడా ప్రకటించింది. దీంతో ఇక ఈసారి టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై చర్చ జరుగుతుంది. అదే సమయంలో గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ గురించి కూడా అందరూ చర్చించుకుంటూ ఉండటం గమనార్హం.

 గత ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే  వరల్డ్ కప్ లో టీమిండియ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఒక్క ఓటమి కూడా లేకుండా వరుసగా పది మ్యాచ్లలో గెలిచి ఫైనల్ వరకు దూసుకు వెళ్ళింది. అయితే లీక్ దశలో ఏ జట్టునైతే తొలి మ్యాచ్ లోనే టీమ్ ఇండియా ఓడించిందో అదే జట్టు ఫైనల్ లో టీం ఇండియాని ఓడించి కప్పు ఎగరేసుకుపోయింది. అప్పుడు వరకు అద్భుతంగా రాణించిన టీమిండియా ఇక ఫైనల్ మ్యాచ్లో మాత్రం తడబడి చివరికి టీమిండియ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి గల కారణాలపై వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

 ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. 11 ఓవర్ నుంచి 40 ఓవర్ మధ్య అసలు ఫీయర్ లెస్ క్రికెట్ ఆడలేదు అంటూ చెప్పుకొచ్చాడు  ఇదే ఓటమికి కారణమైంది అంటూ తెలిపాడు. ఇక పరోక్షంగా విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ స్లో బ్యాటింగ్ తో చిరాకు తెప్పించారు అంటూ విమర్శలు గుప్పించాడు.  వరల్డ్ కప్ లో తాము ప్రతి మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ అనుకునే వాళ్ళమని.. అందుకే 2011 వరల్డ్ కప్ గెలిచాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా టీమిండియా అలాగే ప్రతి మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ అని భావిస్తే కప్పు గెలుస్తుంది అని అభిప్రాయపడ్డాడు. కానీ గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో కోహ్లీ 63 పంతులు 54,కేఎల్ రాహుల్ 107 బంతుల్లో 66 పరుగులు చేసి స్లో బ్యాటింగ్ చేయడం.. ఇక తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లు కూడా ఒత్తిడితో తక్కువ పరుగులకే అవుట్  కావడంతో చివరికి టీమిండియాకు ఓటమి తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: