మంజుమ్మల్ బాయ్స్ మూవీకి షాక్.. మూవీ టీం కి ఇళయరాజా నోటీసులు..!?

Anilkumar
ఇటీవల బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాల్లో మంజుమ్మల్ బాయ్స్ సినిమా కూడా ఒకటి. ఇక ఈ సినిమా రియల్ ఇన్స్టెంట్ ఆధారంగా తెరకెక్కింది. మొదట మలయాళంలో విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తెలుగులో సైతం విడుదల చేశారు. ఇక ఫిబ్రవరిలో విడుదలైన ఈ సనిమా దాదాపుగా 200 కోట్లకు పైగా వస్తువులు చేసింది. అంతేకాదు తెలుగులో మాత్రం భారీ సక్సెస్ అందుకుంది. కేరళ నుంచి తమిళనాడులోని కొడైకెనాల్‏ను సందర్శించిన కొందరు స్నేహితులు గుణ గుహలను చూసేందుకు

 వెళ్తారు. అక్కడే తమ స్నేహితుడు ఆ గుహలలో పడిపోవడంతో తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ స్నేహితుడిని రక్షించుకున్నారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమా ను రూపొందించారు. ఇక బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా చిక్కుల్లో పడింది. అయితే ఈ సినిమా చిత్ర బృందానికి తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా లీగల్ నోటీసులను పంపించడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్ లో 1991లో కమలహాసన్ నటించిన గుణ సినిమాలోని కన్మని అనే పాటను ఉపయోగించారు. అయితే అప్పట్లో

 ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఇళయరాజా ఉన్నారు. ఇక అప్పట్లో ఈ సాంగ్ ఎంతలా వైరల్ అయిందో  చెప్పనవసరం లేదు. దాంతో ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉంది. తాజాగా ఇప్పుడు వారి అనుమతి లేకుండా ఈ పాటను ఈ సినిమాలో వాడుకున్నందుకు ఇళయరాజా ఈ సినిమా చిత్ర బృందానికి లీగల్ నోటీస్ లు పంపించారు. కాపీ రైట్ చట్టం ప్రకారం ఈ పాటకి సంబంధించిన అన్ని హక్కులు ఇళయరాజా కి మాత్రమే ఉంటాయి. అలాంటప్పుడు ఈ పాటను వారి సినిమాలో ఉపయోగించుకోవడం సరికాదు. ఇక వారి సినిమాలో ఈ పాటను ఉపయోగించుకోవాలి అంటే దానికి తగిన పరిహారాన్ని చెల్లించాలి అంటూ ఇళయరాజా ఆ నోటీసులో పేర్కొన్నారు. లేదంటే కాపీరైట్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లుగా చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటాము అని నోటీసులో పేర్కొన్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: