"గేమ్ చేంజర్" విషయంలో భయపడుతున్న శంకర్..!?

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో తరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు గేమ్ చేంజెస్ సినిమాతో పాటు ఇండియన్ 2 సినిమాను సైతం ఫ్యాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఇప్పటికే ఈ సినిమాపై

 దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుంది అని అందరూ అంటున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా విషయంలో శంకర్ కాస్త భయపడుతున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అదేంటంటే ఒకవేళ భారతీయుడు సినిమా తేడాకొడితే  గేమ్ చేంజెస్ సినిమాపై ఆ ఎఫెక్ట్ పడుతుంది ఏమో అని శంకర్ బాగా టెన్షన్ పడుతున్నాడు అన్న వార్తలు ప్రస్తుతం సోషల్

 మీడియా వేదికగా పెద్ద ఎత్తున వినబడుతున్నాయి. ఇక ఇప్పటికే శంకర్ ఈ సినిమాతో మెగాస్టార్ కి ఇటు రాంచరణ్ కి మంచి హిట్ ఇస్తాను అని మాటిచ్చాడట. మూడు సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం వెయిట్ చేయించాడు శంకర్. మరి ఇంతలా ఈ సినిమా కోసం రామ్ చరణ్ ను ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయించినందుకు సినిమా రిసల్ట్ ఎలా వస్తుందో అని భయపడుతున్నాడట.  ఇక ఇప్పటికే శంకర్ పై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు. ఎందుకంటే ఇంత సమయం తీసుకుని కూడా సినిమాను ఇంకా పూర్తి చేయలేదు అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అనుకున్నట్లు జరగకుండా సినిమా విషయంలో ఏదైనా తేడా జరిగితే మాత్రం రామ్ చరణ్ అభిమానులు శంకర్ ను భారీ ఎత్తున ట్రోల్ చేస్తారు. అంతేకాదు ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే గనక శంకర్ తో సినిమా చేయడానికి ఏ హీరో కూడా ముందుకు రాడు అన్న సమాచారం కూడా వినబడుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: