ఆగి ఉన్న కారు.. చిన్నారి ప్రాణం తీసింది.. అసలేం జరిగిందంటే?

praveen
విధి ఆడే వింత నాటకంలో మనుషుల జీవితాలు కేవలం కీలుబొమ్మలు లాంటివి మాత్రమే అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే విధి ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది తప్ప.. ఇక మనిషి తానే అని చేస్తున్నానని అనుకుంటాడు అని చెబుతూ ఉంటారు. అయితే నేటి జనరేషన్లో జనాలు ఇదంతా ట్రాష్ అని కొట్టిపారిస్తున్న వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఏదైనా పెద్ద అనారోగ్య సమస్య వస్తే లేదంటే ఇంకేదైనా అనూహ్యమైన ఘటన జరిగితేనో.. అర్ధంతరంగా ప్రాణాలు పోతాయి అని నమ్ముతూ ఉంటారు అందరూ.

 కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఎవరి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రాణం పై తీపిని పెంచుతూ ఉన్నాయి అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఆభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కొన్ని కొన్ని సార్లు విధి ఏకంగా కక్షగట్టినట్లుగానే వ్యవహరించే తీరు అందరిని మనసును మెలిపెడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అప్పుడు వరకు కళ్ళ ముందు చిరునవ్వులు చిందిస్తూ ఆడుకుంటున్న చిన్నారి నిమిషాల వ్యవధిలోనే అనంత లోకాలకు వెళ్ళింది.

 ఏకంగా ఆగి ఉన్న కారు ఆ చిన్నారి ప్రాణం పోవడానికి కారణమైంది. కారులోకి వెళ్లి కూర్చున్న చిన్నారి డోర్ వేసింది. అయితే డోర్ లాక్ కావడంతో ఆ చిన్నారికి మళ్ళీ బయటకి ఎలా రావాలో తెలియలేదు. దీంతో అదే కార్ లో ఊపిరాడక ప్రాణాలు విడిచింది.  మణుగూరు మండలం సాంబాయిగూడెంలో ఈ విషాదకర ఘటన జరిగింది. ఆడుకుంటూ కారెక్కిన మూడేళ్ల చిన్నారి కార్ డోర్ లాక్స్ అవడంతో మృతి చెందింది. కాల్నిషా అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ కార్ ఎక్కింది. అంతలోనే డోర్స్ లాక్ అవడంతో ఇక ఊపిరాడక చనిపోయింది. అయితే ఇంటి పక్కనే ఆడుకుంటున్నది అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. తర్వాత కనిపించకపోవడంతో ఎంత వెతికిన ఆచూకీ కనిపించలేదు. చివరికి ఇంటి ముందు నిలిచి ఉన్న కారులో కనిపించింది. వెంటనే డోర్స్ ఓపెన్ చేసిచూడక అప్పటికే చిన్నది ప్రాణాలు కోల్పోయింది.దీంతో తల్లిదండ్రులు అరణ్య రోజున విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: