భర్తే సర్వస్వం అనుకుంది.. కానీ అతనే చంపేసాడు?

praveen
భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటైన తర్వాత కలకాలం కష్టసుఖాలను పంచుకోవాలి. అందుకే వేదమంత్రాలు సాక్షిగా ఇక ఒకరికి ఒకరు వందేళ్ల పాటు తోడునీడగా ఉంటామని ప్రమాణం చేసి మరి.. ఇక యువతీ యువకులు దాంపత్య బంధం లోకి అడుగుపెడుతూ ఉంటారు. ఇక ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటారు. కానీ నేటి రోజుల్లో దాంపత్య బంధంలో ఇలాంటి అన్యోన్యత మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఏకంగా అదనపు కట్నం కావాలంటూ   కట్టుకున్న వారిని దారుణంగా వేధిస్తున్న వారు కొంతమంది అయితే.. ఇక పరాయి వ్యక్తుల మోజులో పడిపోయి అక్రమ సంబంధాలతో బార్యలను వేధిస్తున్న భర్తలు ఇంకొంతమంది.

 ఇలా కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆడపిల్లలకు చివరికి వేధింపులు తప్పడం లేదు. ఇలాంటి తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో  అదనపు కట్నం కావాలంటూ భార్యలను హింసిస్తున్న ఘటనలు తరచు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. భర్తే సర్వస్వం అనుకుంది. మెట్టినట్లు అడుగుపెట్టిన ఆ భార్య పట్ల చివరికి కట్టుకున్న వాడే కాలయముడిగా మారిపోయాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది  రామనగర జిల్లా చిన్న పట్నం తాలూకా మంగళ హళ్లి గ్రామం లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

 30 ఏళ్ల అశ్విని అనే మహిళకు మంగళ హళ్లి గ్రామానికి చెందిన రమేష్ తో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన చాలా కాలం పాటు ఇతరు ఎంతో అన్యోన్యంగానే ఉన్నారు. అయితే తర్వాత రమేష్ మనసులో దుర్బుద్ది ఏర్పడింది. అదనపు కట్నం కోసం ఇక భార్యను వేధించడం మొదలు పెట్టాడు. తరచు ఇదే విషయంపై భార్యతో గొడవ పడుతూ ఉండేవాడు  అలాగే గొడవలతో సంసారం సాగుతూ వచ్చింది. అయితే వీరి మధ్య ఇటీవల ఇలాంటి గొడవే మరోసారి జరిగింది  అయితే ఈసారి వాగ్వాదం శృతిమించింది. ఆగ్రహంతో ఊగిపోయిన భర్త రమేష్ భార్యపై దారుణంగా దాడి చేశాడు. భార్య చాతి తల లాంటి భాగాలు తీవ్రంగా దాడి చేయడంతో ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. భార్య చనిపోయింది అని నిర్ధారించుకున్న అతను.. అక్కడి నుంచి పారిపోయాడు. అయితే పక్కనే ఉన్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక పరాలిలో ఉన్న నిందితుని వెతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: