SRH చిత్తుగా ఓడినా.. కమిన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడట?

praveen
ఎప్పుడూ బౌలింగ్ మీద ఆధారపడుతూ ఉండే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో మాత్రం బ్యాటింగ్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్ లో కూడా అడుగు పెట్టింది. కానీ కీలకమైన నాకౌట్ మ్యాచ్ లలో మాత్రం సన్రైజర్స్ తడబడింది  దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు  ఇటీవలే మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జడ్ల మధ్య జరిగిన మ్యాచ్లో చివరికి హైదరాబాద్ జట్టు ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే.

 అది కూడా ఏకంగా ఎనిమిది టికెట్లు తేడాతో ఓడిపోవడంతో అభిమానులు మరింత నిరాశలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరు జట్టుపై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఇక రెండవ క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటి క్వాలిఫైయర్ లో విజయం సాధించిన కోల్కతా జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్ళింది అని చెప్పాలి. అయితే ఇలా కీలకమైన మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ.. సన్రైజర్స్ కెప్టెన్ కమిన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగానే ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారిపోతున్నాయి.

 అదేంటి క్వాలిఫైయర్ లాంటి మ్యాచ్లో సన్రైజర్స్ ఓడిపోతే ఆ జట్టు కెప్టెన్ అయిన కమిండ్  ఎందుకు హ్యాపీగా ఉంటాడు అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఇలా కమిన్స్ హ్యాపీగా ఉండడానికి వేరే రీసన్ ఉంది. అదేంటంటే కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్  స్టార్క్ సూపర్ బౌలింగ్ తో ఆకట్టుకోవడమే. ఈ సీజన్ మొత్తం చెత్త బౌలింగ్ తో విమర్శలు ఎదుర్కొన్న  స్టార్క్  మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో మాత్రం ఆకట్టుకున్నాడు  మూడు వికెట్లు తీసి హైదరాబాద్ జట్టును చావు దెబ్బ కొట్టాడు   బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండే పిచ్ పై బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించే బ్యాట్స్మెన్లను సైతం తక్కువ పరుగులకే పరిమితం చేశాడు. ఇదే కమిన్స్ ఆనందానికి కారణమట. ఎందుకంటే ఐపిఎల్ ముగిసిన తర్వాత జూన్ నెలలో అటు వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. స్టార్క్ ఆస్ట్రేలియాకు ఎంతో కీలకమైన బౌలర్. అయితే ఐపీఎల్ కంటే కమిన్స్ దృష్టి వరల్డ్ కప్ పైన ఉంటుంది. అందుకే తన జట్టు బౌలర్ మళ్ళీ ఫామ్ లోకి రావడంతో ఇక సన్రైజర్స్ ఓడిన కమిన్స్ మాత్రం హ్యాపీగా ఉన్నారు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: