టాలీవుడ్లో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి, గత కొన్ని సంవత్సరాలుగా వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. పెళ్లి తరువాత సినిమాలు తగ్గించిన్నట్లు అనిపిస్తోంది. వరుసగా వచ్చిన ఆఫర్లతో కెరీర్ ప్రారంభంలోనే మంచి సినిమాలు చేసినా, ఈ మధ్యకాలంలో ఆమె ప్రాజెక్టులు తగ్గడం గమనార్హం. అటు పెళ్లి, ఇటు కొత్త ప్రయోగాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ప్రస్తుతం మరింత గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో వివాహం చేసుకున్న లావణ్య, తన కెరీర్ విషయంలో ఇప్పుడు మరింత ఆచితూచి అడుగులు వేస్తోంది.ఇదిలావుండగా లావణ్య పెళ్లి కి ముందు విశ్వక్ ఖండేరావ్ అనే దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్ చేస్తానని మాట ఇచ్చిందట. ప్రస్తుతం డైరెక్టర్ తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడట. కానీ ఇందులో హీరోయిన్ పాత్ర బోల్డ్‌గా ఉండటంతో ఈ ముద్దుగుమ్మ దర్శక, నిర్మాతలకు మరోక హీరోయిన్ను చూసుకోమని చెప్పిందట.అయితే ఈ ప్రాజెక్ట్ తర్వాత కొన్ని కారణాలతో బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆపేశారు. అయితే ఎలాగూ సినిమా క్యాన్సిల్ అయింది కదా అని లావణ్య కూడా సైలెంట్ అయిపోయిందట. అగ్రిమెంట్ క్యాన్సల్ చేసుకోవడం నెగ్లెట్ చేసింది.
కాగా ఇప్పుడు లావణ్య మెగా ఇంటి కోడలు అయిన తరుణంలో ఆమె స్టేటస్ ని ఉపయోగించుకొని తమ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆ డైరెక్టర్ మరోసారి లావణ్యతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఆ అగ్రిమెంట్‌ను పదేపదే లావణ్య కు పంపిస్తూ మీరు ఈ ప్రాజెక్టులో నటించాల్సిందే అంటూ మొండి పట్టు పట్టాడట.ఇక ఈ విషయంలో లావణ్యది ఏమాత్రం తప్పులేకున్నా ఆ ప్రాజెక్ట్ కమిట్ అయిన కారణంగా అప్పుడు ప్రాజెక్టును క్యాన్సిల్ చేసినా తను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయలేదు కాబట్టి.. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నారట. అయితే ఈ రొమాంటిక్ సినిమాలు చేయడానికి లావణ్య కు అసలు ఇష్టం లేదట. కానీ ఆమె చేసిన అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేసుకోకపోవడంతో ఆమె అడ్డంగా ఈ సమస్యలు ఇరుక్కుపోయింది. ఇలాంటి క్రమంలో లావణ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.ఇక ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవ్వడంతో.. మెగా ఫ్యాన్స్ ఆ డైరెక్టర్ పై మండిపడుతున్నారు. మెగా ఇంటి పరువు తీయడానికి మెగా ఫ్యామిలీ పై ట్రోల్ చేసేందుకు.. ఓ సాకు కోసమే ఇలాంటివన్నీ చేస్తున్నారని లావణ్య త్రిపాఠి లీగల్ గా ప్రొసీడ్ అవ్వడమే కరెక్ట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.