ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం.. ఇందులో పాల్గొంటున్న మన ఆంధ్ర ప్లేయర్లు వీరే..!
ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనేకమంది ప్రతిభావంతులైన క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ రెండు రోజుల వేలంలో వివిధ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ఈ తెలుగు ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. ఆంధ్రా ఆటగాళ్లలో షేక్ రషీద్, బైలపూడి యశ్వంత్, అశ్విన్ హెబ్బార్, పృథ్వీరాజ్, పివిఎస్ఎన్ రాజు, మారంరెడ్డి హేమంత్ రెడ్డి, మనీష్ రెడ్డి, యద్దెల గిరీష్ రెడ్డి, గిరినాథ్ రెడ్డి తదితరులు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ఉత్తమ బేస్ ప్రైజ్ ను రూ.30 లక్షలుగా నిర్ణయించారు.
ఇదిలా ఉండగా క్రికెట్‌లోని కొంతమంది స్టార్ ప్లేయర్లు గరిష్టంగా రూ.2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి అడుగుపెట్టారు. వీరిలో ఇండియన్స్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ ప్లేయర్లు కూడా ఉన్నారు. ఉదాహరణకు జోస్ బట్లర్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కగిసో రబడ, అర్ష్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, యుజ్వేంద్ర చాహల్, లియామ్ లివింగ్‌స్టోన్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ తదితరులు తమ బేస్ ప్రైస్ ను రెండు కోట్లుగా నిర్ణయించారు కానీ మీరు ఇంతకంటే ఎక్కువ ధర పలకవచ్చు. ఎందుకంటే ఈ ప్లేయర్లు బాగా ఆడతారు టీం ని గెలిపించగలరు కాబట్టి ఈ ఫ్రాంచైజీల వీళ్ళ కోసం పోటీ పడొచ్చు. ఫ్రాంచైజీలు తమ కలల జట్లను నిర్మించుకోవడానికి పోటీపడుతున్నందున వేలం ఉత్సాహాన్ని ఇస్తుంది.