చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచిస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి!
ఒకవేళ నెగిటివ్ థింకింగ్ ఎక్కువైతే అన్ని ఇబ్బందులుగానే, కష్టాలుగానే కనిపించి, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ మానసిక సమస్యలు తలెత్తితే ఎంత మందిలో ఉన్న ఒంటరిగానే ఫీలవుతారు. వారిని ఒంటరితనం చుట్టుముట్టేస్తుంది. దీనివల్ల తీవ్ర ఒత్తిడికి గురి అవుతారు. క్రమంగా తీవ్ర మానసిక సమస్యలకు లోనవుతారు. అందుకే దేని గురించి అయినా అవసరానికి మించి ఆలోచించకూడదు. అతిగా ఆలోచించటం వల్ల మానసిక ఆరోగ్యానికే కాదు, శారీరక ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు. ఓవర్ రియాక్ట్ వల్ల నిద్రలేమి, ఆందోళన, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా ఇది మెదడు కణాలపై ఒత్తిడిని పెంచి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. అది ఆలోచనలు వేధిస్తున్నప్పుడు ఏదైనా సినిమా చూడండి. మహిళలైతే కొత్త వంటలు ప్రయత్నించండి. పెయింటింగ్, డాన్స్ వంటివి చేయండి. ఇతర ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఇష్టమైన పని చేస్తూ ఉండండి. ధ్యానం అనేది మనసును ప్రశాంతంగా ఉంచి, మైండ్ ను కంట్రోల్ చేస్తుంది. చిన్న చిన్న తప్పుల విషయంలో ఎక్కువగా ఆలోచించకూడా వాటిని అనుకూలంగా మార్చుకోవాలి. ఇలా చేస్తే ఒంటరితనం అనే ఫీలింగ్ రాదు. ఆరోగ్యానికి కాపాడుకోవడం కోసం అతిగా ఆలోచించటం మానేసి, భవిష్యత్ గురించి ఎక్కువగా ఆలోచించడకుండా ప్రస్తుత క్షణంలో సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోండి.