చర్మం మెరవాలంటే క్యారెట్ ను ఇలా వాడడండి!
చలికాలంలో మీ చర్మం మెరిసిపోవాలంటే క్యారెట్ ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా క్యారెట్ నువ్వు తీసుకొని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం తేనెను మిక్స్ చేసి ముఖానికి మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా రానికీ మూడు రోజులు పాటు చేస్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన కోల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు క్యారెట్ సహాయపడుతుంది. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్ సూర్యుని యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. క్యారెట్ జ్యూస్ తాగటం ఇబ్బందిగా అనిపించిన వారు దీనిని టోనర్ గా ఉపయోగించవచ్చు.
దీనికోసం కప్పు క్యారెట్ రసం, మరో కప్పు బీట్ రూట్ రసం, ఒక స్పూన్ నిమ్మరసంను తీసుకోవాలి. వీటన్నిటిని స్ప్రే బాటిల్ లో నింపాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగి, చర్మంపై స్క్రబ్ చేయండి. ఇలా 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, శుభ్రంగా కడిగేయండి. కొంతమందికి వయస్సు పెరుగుతున్న కొద్ది ముఖంపై ముడతలు వస్తుంటాయి. అలా రాకుండా ఉండటానికి ఈ క్యారెట్ పేస్ట్ ప్యాక్ వేసుకుంటే స్కిన్ బిగుతుగా మారుతుంది. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ పెరుగులో క్యారెట్ జ్యూస్ మిక్స్ చేసుకుని, అందులో ఒక స్పూన్ తేనెను కలపాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండుసార్లు ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది.