మహారాష్ట్ర ఎన్నికలు: కూటమిలో మొదలైన లొల్లి..ఉత్కంఠ రేపుతున్న సీఎం సీట్.?

FARMANULLA SHAIK
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలిపోయాయి. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడి'ని విజయానికి అతిదూరంగా పరిమితం చేసి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరించనుందనే అంశంపైనే ప్రధానంగా అందరి దృష్టి ఉంది.ఈ నేపథ్యంలో సీఎం పదవి పై మహాయుతి కూటమి లో పోటాపోటి నెల్కొంది.ఇదిలావుండగా 220కి పై గా స్థానాల్లో మహయుతి కూటమి అధిక్యం లో వుంది. ఈ క్రమంలో 125స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా బీజేపీ నిలిచింది.ఈ నేపథ్యంలో సీఎం రేస్ లో బీజేపీ నేత దేవేంద్ర ఫడనవిస్ ముందున్నారు. అయితే అజిత్ పవార్ నే సీఎం చేయాలనీ ఎన్సిపి వర్గం పట్టు పడుతున్నారు. ఈ క్రమంలో నే మహయుతి గెలుపులో షిండేదే కీలక పాత్ర అంటున్న శివసేన వర్గం.ఈ క్రమంలో ఈ నెల 26తో ముగియనున్న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు. ఈలోగా కొత్త ప్రభుత్వం కొలువు దిరాల్సిన పరిస్థితి ఉంది.ఇదిలావుండగా ఇందులో శిందే ప్రస్తుత సీఎం కాగా.. ఫడ్నవీస్ మాజీ సీఎం, ఇప్పుడు డిప్యూటీ సీఎం. కూటమి గెలుపులో షిండే, ఫడ్నవీస్ కీలక పాత్ర పోషించారు. దీంతో వీరిద్దరి మధ్య పోటీ ప్రధానంగా ఉందన్న చర్చ సాగుతోంది.అయితే.. బీజేపీ హైకమాండ్ ఆలోచన ఏంటన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఆర్ఎస్ఎస్ మాత్రం ఫడ్నవీస్ సీఎం కావాలని తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. బీజేపీ హైకమాండ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ ను కేంద్ర ప్రభుత్వంలోకి తీసుకోవాలని ఆ పార్టీ హైకమాండ్ ఇప్పటికే డిసైడ్ అయ్యిందన్న ప్రచారం సాగుతోంది. ఎవరూ ఊహించని కొత్త నేతను రాష్ట్రంలో తెరపైకి తెచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అంటే మధ్య ప్రదేశ్ ఫార్ములాను బీజేపీ ఫాలో అవుతుందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా మహారాష్ట్రలో బిజెపి గెలవడం పై ప్రధాన పాత్ర పోషించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: