కేవలం నిమ్మకాయ- పసుపుతో క్రికెటర్ భార్య క్యాన్సర్ నయం..!
అది కూడా కేవలం నిమ్మరసం, పచ్చి పసుపు, యాపిల్ సైడర్, వెనిగర్, తులసి ,వేపాకులు వంటి వాటి ద్వారా క్యాన్సర్ మహమ్మారిని జయించినట్లుగా తెలియజేశారు. అలాగే స్ట్రిక్ట్ డైట్ కూడా ఫాలో అవ్వడం వల్ల క్యాన్సర్ రికవరికి సహాయపడింది అంటూ తెలియజేశారు. అయితే ఈ విషయం పై నిపుణులు మాత్రం ఏం చెప్పారంటే గడిచిన కొన్నాళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడిన నవ్య జ్యోతి చికిత్స తీసుకున్నదని.. అప్పుడు తగ్గిపోయింది అనుకున్నారు.. కానీ కుమారుడు వివాహం తర్వాత స్టేజ్ -3 రూపంలో మళ్లీ వచ్చిందని చికిత్స తీసుకున్న ఫలితం లేకపోయిందనీ తెలిపారు.
అయితే కేవలం ఐదు శాతం మాత్రమే అవకాశం ఉన్నది కోలుకోవడం చాలా కష్టమని వైద్యులు వెల్లడించారని.. కానీ కఠినమైన ఆహార నియమాలు జీవన శైలిలో మార్పులతో ఆమె క్యాన్సర్ సైతం ఓడించి గెలిచిందనీ.. క్రమశిక్షణ ఆహార నియమాలను పాటించి 40 రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జ్ అయ్యింది అంటూ తెలియజేశారు భర్త సిద్దు. అలాగే చక్కెర కార్బోహైడ్రేట్లు లేని ఆహారం తినడం వల్ల కూడా క్యాన్సర్ ని దూరం చేసుకోవచ్చని తెలిపారు.. తన భార్యకు రోజు నిమ్మరసంతో ప్రారంభించి పచ్చి పసుపు తినేదని అలాగే వేపాకులు వెనిగర్ ,తులసి, వంటి ఆకులు కూడా తినేదని తెలిపారు.. గుమ్మడికాయ, దానిమ్మ, బీట్రూట్ , వాల్నట్స్ వంటి రసాలు కూడా రోజువారి ఆహారంలో భాగంగా ఉండేవని తెలిపారు.