'పుష్ప 3' పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన సుకుమార్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన నటిస్తున్న లేటెస్ట్ సినిమా పుష్ప 2. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన పుష్ప సినిమా ఊహించని స్థాయిలో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకోవడంతో దీనికి సీక్వెల్ గా ఇప్పుడు పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇప్పటికే సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. కానీ ఫహాద్

 ఫాసిల్ కి  సంబంధించిన కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాట కూడా చిత్రీకరించడం బాలెన్స్ ఉన్నట్లుగా సమాచారం వినబడుతోంది. దీని షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమాలో నటించిన ఆర్టిస్టులకి రిలీఫ్ దొరుకుతుందేమో కానీ సినిమా విడుదల అయ్యేంతవరకు సుకుమార్ కి మాత్రం రెస్ట్ దొరకదు అని చెప్పొచ్చు. అయితే మరీ ఈ సినిమా తర్వాత సుకుమార్ పుష్ప 3 ప్లాన్ చేస్తున్నాడా లేదా వేరే హీరోతో సినిమా చేస్తాడా అన్న అనుమానాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వినబడుతున్నాయి.  ఈ సినిమా తరువాత సుకుమార్

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. రంగస్థలం సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమాపై నెక్స్ట్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళిద్దరి కాంబినేషన్లో గనక సినిమా వస్తే కచ్చితంగా అది కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అందుకే దానికి సంబంధించిన స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులకు కూడా చాలా సమయం పడుతుంది. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ తో కూడా సుకుమార్ ఒక సినిమా చేయాలి అన్న వార్తలు ఎప్పటినుండో వినబడుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.  ఈ సినిమాలన్నీ పూర్తయిన తర్వాత అయినా సుకుమార్ తో సినిమా చేస్తాడా అన్నది చూడాలి. అయితే ఇప్పుడు ఈ సినిమాలన్నీ సుకుమార్ చేస్తే మాత్రం ఆయనకి క్షణం కూడా తీరిక ఉండదు అని చెప్పాలి. మరి సుకుమార్ ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేస్తాడు అన్నది ఇప్పుడు సర్వత్ర ఆసక్తికరంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: