కోలీవుడ్ లో సంచలనం.. సూర్య-జ్యోతిక మధ్య గొడవలు..?

Pandrala Sravanthi
ఏంటి కోలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సూర్య జ్యోతిక ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయా.. ఇది నిజమేనా.. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య విభేదాలు ఎక్కడ వచ్చాయి.. వీరు గొడవలు పడడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ మధ్యనే పెళ్లయ్యి 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ అన్యోన్య జంట మధ్య ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య జ్యోతిక..కోలీవుడ్ లో ఈ జంటకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరిద్దరూ సినిమాల్లో చేసే సమయంలో ప్రేమలో పడి మొదట ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకొని ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అలా సూర్య జ్యోతికల వివాహం రెండుసార్లు జరిగింది.ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఒక పాప ఒక బాబు పుట్టిన సంగతి కూడా మనకు తెలిసిందే.


 ప్రస్తుతం సూర్య జ్యోతికల పిల్లలు కూడా పెద్దవాళ్లయ్యారు. ఇక ఈ మధ్యనే సూర్య జ్యోతిక చెన్నై ని వదిలేసి ముంబైకి వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.ఆ సమయంలో జ్యోతికకి అత్తమామలతో విభేదాలు ఎదురవడం వల్లే సూర్య తన భార్యను తీసుకొని తల్లిదండ్రులకు దూరంగా ముంబైకి మకాం మార్చారు అని ప్రచారం జరిగింది.కానీ ఈ ప్రచారంపై సూర్య జ్యోతికలు క్లారిటీ ఇచ్చారు. తమ పిల్లల చదువు కోసమే ముంబైకి వెళ్ళామని,అంతేకానీ మా కుటుంబంలో  విభేదాలు ఉన్నాయి అనే వార్తలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. ఇదంతా పక్కన పెడితే గతంలో ఓ ఇంటర్వ్యూలో జ్యోతిక మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.


రీసెంట్ గానే 19వ పెళ్లిరోజుని జరుపుకున్న సూర్య జ్యోతిక లకి సంబంధించి ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.అదేంటంటే సూర్య చేసే ఒక్క పని వల్ల జ్యోతిక తరచూ గొడవ పెట్టుకుంటుందట.మరి ఇంతకీ సూర్య చేసే ఆ పని ఏంటయ్యా అంటే బాత్రూంలో ఎక్కువసేపు గడపడమే.. సూర్య అంటే ప్రతి విషయంలో తనకు ఇష్టమే. కానీ సూర్య గురించి నచ్చని ఒకే ఒక్క విషయం ఏమిటంటే.. ఆయన బాత్రూంలో ఎక్కువసేపు గడుపుతారు. ఈ చెడ్డ అలవాటే మా మధ్య తరచూ గొడవ పెడుతుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా సూర్య తన అలవాటుని మార్చుకోలేకపోతున్నారు అంటూ జ్యోతిక చెప్పిన వీడియో నెట్టింట వైరల్ గా మారడంతో కొంతమంది నెటిజన్స్ సూర్య జ్యోతిక మధ్య గొడవలు జరుగుతున్నాయి అన్నట్లుగా పోస్టులు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: