పెద్ది సినిమా ట్రైలర్ ఎప్పుడంటే..?
ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగానే ఎదురుచూస్తున్నారు. పెద్ది సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్, గ్లింప్స్ సైతం విడుదలై సినిమా అంచనాలను పెంచేశాయి. పెద్ది సినిమా ట్రైలర్ అప్డేట్ కోసం అభిమానులు ఎగ్జైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న ప్రకారం ట్రైలర్ మే 16వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ ప్రాంతంలో భారీ ఈవెంట్ మధ్య ట్రైలర్ లాంచ్ నిర్వహించినట్లుగా వినిపిస్తోంది. పెద్ది సినిమాని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. అందుకే నార్త్ లో కూడా ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోషన్ చేసేలా ఉంటుందని ఈ విధంగా ప్లాన్ చేసినట్లు వినిపిస్తోంది. మరి ఈ విషయం పైన చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటిస్తుందేమో చూడాలి మరి.
జూన్ 4వ తేదీన చాలా గ్రాండ్గా విడుదల కాబోతున్న ఈ సినిమా అమెరికాలో మాత్రం ఒకరోజు ముందే (జూన్ 3న) పెద్ద ఎత్తున ప్రీమియర్స్ పడబోతున్నాయి. తాజాగా నార్త్ అమెరికాకు సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ ఓపెన్ అయ్యాయి, ధర కూడా అధికారికంగా ప్రకటించారు. తెలుగు వర్షన్ టికెట్ ధరలు స్టాండర్డ్ 2D స్క్రీన్ కోసం పెద్దలకు $25 , పిల్లలకు$20 గా ఫిక్స్ చేశారు. సినిమా విడుదలైన తర్వాత ఒక వారం రోజులకు టికెట్ రేట్లు కూడా తగ్గుతాయి. అయితే తమిళ్ ,కన్నడ ,మలయాళం, హిందీ వర్షన్స్ కు మాత్రం ప్రీమియర్ షోలు ఉండవట.