పాకిస్థాన్ లో దుమ్ము దులిపేస్తున్న దురంధర్..!
విడుదలైన అతి తక్కువ రోజులలోనే దురంధర్ మూవీ పాకిస్థాన్ నెట్ ఫ్లిక్ లో నంబర్ వన్ ట్రెండీ గా నిలిచింది. గత శనివారం నుంచి నెట్ ఫ్లిక్ లో పాకిస్థాన్ టాప్ 1 ట్రెండీ చిత్రంగా ఈ చిత్రం నిలిచినట్లు పలు నివేదికలు తెలుపుతున్నాయి. జనవరి 30వ తేదీన శుక్రవారం ఓటీటిలో స్ట్రీమ్మింగ్ అయినా దురంధర్ చిత్రం ఒక స్పై థ్రిల్లర్ చిత్రంగా ఉంది. ఇందులో రణబీర్ పాకిస్తాన్లోని లియారీలోని ఒక ముఠాలో ఇండియన్ గూఢచారి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా కొన్ని నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.
గత కొన్నేళ్లుగా ఇండియన్ చిత్రాలను పాకిస్థాన్ థియేటర్లలో రిలీజ్ చేయడానికి అనుమతి లేకపోవడంతో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు. కానీ నెట్ ఫ్లిక్ స్ట్రిమింగ్ లో మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలై ఒక సరికొత్త సంచలనాలను సృష్టిస్తోంది. ఈ సినిమా చూసిన పలువురు పాకిస్థాన్ నేటిజన్స్ ఇలా కామెంట్స్ చేస్తూ.. ఇది నేను చూసిన అత్యుత్తమ బాలీవుడ్ చిత్రం, అలాగే మొదటిసారి తాను నిజంగా పరిశోధన చేసిన పాకిస్తాన్ చిత్రాలలో.. ఆదాబ్, సుర్మా కాజల్, టోపీ, చొక్కా, జనాబ్ ఉపయోగించని చిత్రాన్ని చూశానని తెలిపారు. నేరాలలో పాల్గొన్న రాజకీయ పార్టీని చూపించి వాటిని బహిర్గతం చేసినందుకు ధన్యవాదాలు అంటూ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా దురంధర్ పార్ట్ 2 పై చాలా ఆసక్తికరంగా ఉన్నాను అంటూ అలాగే దయచేసి చౌదరి అస్లాంను సానుకూల పాత్రలో చూపించండి అంటూ తెలిపారు.