వరల్డ్ కప్ లో సంజూకి నో చాన్స్.. షాక్ అవుతున్న ఫ్యాన్స్?

praveen
ప్రపంచ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియా గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ టోర్నీ గెలవడంలో వెనుకబడి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత ఏడాది దాదాపు కప్పు కొట్టినంత పని చేసిన టీమిండియా.. ఫైనల్ లో ఓడిపోయి అందరిని నిరాశపరిచింది. అయితే జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో మాత్రం తప్పనిసరిగా టైటిల్ విజేతగా నిలిచి.. విశ్వవిజేతగా అవతరించాలి అని కంకణం కట్టుకుంది. ఈ క్రమంలోనే అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది.

 ఇప్పటికే బీసీసఐ టి20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించింది. అయితే ఇందులో కొంతమంది ఆటగాళ్లకు చోటు కల్పించడం పై విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఇలా బీసీసీఐ వరల్డ్ కప్ ఆడబోయే జట్టును ప్రకటించినప్పటికీ.. ఎంతొమంది మాజీ ప్లేయర్లు తమ ఉద్దేశం ప్రకారం ప్లేయింగ్ ఎలెవన్ జట్టు ఏది అన్న విషయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సైతం ఇక టి20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ జట్టు ఎలా ఉంటుంది అనే విషయాన్ని చెప్పుకొచ్చాడు.

 ఐపీఎల్ లో పేలవమైన ఫాంతో నిరాశపర్చిన హార్దిక్ పాండ్యాపై అటు యువరాజ్ సింగ్ నమ్మకం వ్యక్తం చేశాడు. టి20 ప్రపంచ కప్ లో అతను రానిస్తాడు అంటూ చెప్పుకొచ్చాడు  అయితే ఒక్క ఆటగాడి విషయంలో మాత్రం మొండి చేయి చూపించాడు యువరాజ్. వికెట్ కీపర్ బ్యాటర్ గా రాణిస్తున్న సంజు  లేదంటే రిషబ్ పంత్ లలో ఎవరిని తుది జట్టులోకి ఎంపిక చేస్తారు అంటూ అడగగా.. ఆసక్తికర సమాధానం చెప్పాడు. నేను ప్లేయింగ్ ఎలివేన్ లో రిషబ్ పంత్ ను తీసుకుంటాను. సంజూ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. కాని నా అభిప్రాయం ప్రకారం పంత్కు భారత్ మ్యాచ్ గెలిపించే సత్తా ఉంది. గతంలోనూ ఇలా చేశాడు. అలాంటి ఆటగాడే పెద్ద స్థాయిలో మ్యాచ్ విన్నర్ అవుతాడు అంటూ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: