ప్చ్.. డగౌట్ లో కూర్చున్న ముంబై ప్లేయర్లకు జరిమానా.. ఇంతకీ ఏం చేశారంటే?

praveen
సాధారణంగా ప్రొఫెషనల్ క్రికెట్లో ఆడుతున్న ఆటగాళ్లు అందరూ కూడా ఇక ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాము అంటే అసలు కుదరదు. ఎందుకంటే నియమ నిబంధనలకు అనుగుణంగానే ఇక ఆటగాళ్ల ప్రవర్తన తీరు ఉండాలి. ఎవరైనా ఆటగాళ్లు కాస్త అతి చేశారు అంటే చాలు చివరికి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతూ ఉంటుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అయితే ఇక బిసిసిఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా ఇలాంటి కఠినమైన రూల్స్ ఉంటాయి.

 ఈ క్రమంలోనే ఈ రూల్స్ కి తగ్గట్లుగానే అందరూ నడుచుకుంటూ ఉండాలి. కానీ కొంతమంది ఆటగాళ్లు మాత్రం తెలిసి చేస్తారో తెలియక చేస్తారో అర్థం కాదు. కానీ కొన్ని కొన్ని సార్లు విచిత్రమైన పనులు చేసి చివరికి భారీ జరిమానా కట్టాల్సిన పరిస్థితిని కొని తెచ్చుకుంటూ ఉంటారు. సాధారణంగా అయితే డగ్ అవుట్ లో కూర్చున్న ఆటగాళ్లు మైదానంలో బ్యాటింగ్ చేస్తున్న ప్లేయర్లకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి  వీలుండదు.  ఇలా ఎవరైనా చేశారు అంటే అది నిబంధనలకు విరుద్ధం. ఇటీవల ముంబై ఇండియన్స్ లోని ఇద్దరు ఆటగాళ్లు ఇదే చేసి చివరికి భారీ జరిమానా  కట్టవలసిన పరిస్థితిని తెచ్చుకున్నారు.

 ముంబై ఇండియన్స్ ప్లేయర్ టీం డేవిడ్, బ్యాటింగ్ కోచ్ పోలార్డ్ లకు బిసిసిఐ జరిమానా విధించింది.  ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు మ్యాచ్ ఫీజులో 20% జరిమానా చెల్లించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో వైడ్ కోసం రివ్యూ తీసుకోమని సూర్య కుమార్ కు డగ్ అవుట్ నుంచి సైగ చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఇదే విషయంపై పంజాబీ కింగ్స్ అంపైర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు అనే విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పుడు బీసీసీఐ ఇలా సైగ చేసిన ఇద్దరు ఆటగాళ్లపై చర్యలకు సిద్ధమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: