పోరాడి ఓడిన బెంగళూరు..!

MADDIBOINA AJAY KUMAR
ఈసారి ఐ పీ ఎల్ సీజన్ లో కూడా బెంగళూరు వరస అపజయాలతో చాలా పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. ఈ రోజు హైదరాబాద్ సన్రైజర్స్ మరియు బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభం కాక ముందే ఎక్కువ శాతం జనాలు ఇందులో సన్రైజర్స్ గెలుస్తుంది అని భావించారు. ఇకపోతే మొదట బ్యాటింగ్ చేసినటువంటి సన్రైజర్స్ , బెంగళూరు పై 287 పరుగులు చేసింది.

అలా భారీ స్కోర్ ను బెంగళూరు ముందు సన్రైజర్స్ ఉంచింది. ఇలా 288 పరుగుల భారీ లక్ష్యంతో బెంగళూరు జట్టు బ్యాటింగ్ లోకి దిగింది. ఈ జట్టు ఈ మ్యాచ్ లో మంచి పర్ఫామెన్స్ నే కనబరిచినప్పటికీ చివరగా 262 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలు అయ్యింది. దానితో తాజా మ్యాచ్ లో బెంగళూరు టీం పై హైదరాబాద్ జట్టు 25 రన్స్ తేడాతో గెలిచింది. ఇకపోతే ఈ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ అద్భుతమైన బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. ఈయన కేవలం 35 బంతుల్లోనే 83 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ 20 బంతుల్లో 42 పరుగులు చేశాడు.

అలాగే డూప్లెసెస్ 28 బంతుల్లో 62 పరుగులు చేశాడు. వీరంతా ఇంత మంచి ఆట తీరును కనబరిచినప్పటికీ బెంగళూరు జట్టు గెలుపు తీరాలను అందుకోలేక పోయింది. ఇకపోతే ఇప్పటి వరకు జరిగిన ఐ పీ ఎల్ మ్యాచ్ లలో బెంగళూరు 7 మ్యాచ్ లను ఆడగా అందులో కేవలం ఒక దాంట్లో మాత్రమే గెలిచి 6 మ్యాచ్ లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇక హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లను అడగా అందులో నాలుగింట్లో గెలుపొంది రెండింటిలో మాత్రమే ఓడిపోయి పాయింట్ల పట్టికలో అద్భుతమైన స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: