సెలెక్టర్లే కోచ్ లు.. పాక్ క్రికెట్లో ఇది పరిస్థితి?

praveen
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో అనూహ్యమైన పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయన్న విషయం తెలిసిందే. ఒకరకంగా చెప్పాలి అంటే ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ పూర్తిగా సంక్షోభంలో కోరుకుంది. ఆ దేశంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృశ్య క్రికెటర్లకు కనీసం వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి. ఇంకోవైపు క్రికెటర్లకు సరైన ఫిట్నెస్, కోచింగ్ లేకపోవడంతో ఇక వరుసగా ఆ జట్టు విఫలమవుతూనే ఉంది. దీంతో తీవ్రతలు విమర్శలు వస్తున్నాయి. అయితే గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో వరుస ఓటములతో అర్ధాంతరంగా ఇక పాకిస్తాన్ జట్టు టోర్ని నుండి నిష్క్రమించిన తర్వాత ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.

 ఈ క్రమంలోనే బాబర్ కెప్టెన్సీ వదిలేయడంతో ఇక టి20, టెస్ట్ ఫార్మాట్లకు కొత్త కెప్టెన్లను నియమించింది. ఇక ఇప్పుడు ఆ ఆటగాళ్లు కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. అంతేకాదు ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడం.. ఆ జట్టు కోచింగ్ సిబ్బందిని తొలగించడం సంచలనంగా మారింది. అయితే గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ జట్టు కోచ్ లేకుండానే వరుసగా మ్యాచ్ లు ఆడుతూ ఉంది. కాగా కొన్ని రోజుల క్రితమే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నఖ్వి ఇక ఇప్పుడు పాక్ క్రికెట్ ను మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

 కాగా మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్ జట్టు న్యూజిలాండ్తో టి20 సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కోచ్ లేకుండా ఆడుతున్న పాకిస్తాన్ జట్టు విషయంలో ఇప్పుడు పాక్ జట్టు సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారట. సెలెక్టర్లే కోచ్ అవతారం ఎత్తబోతున్నారట. మహమ్మద్ యూసుఫ్, అబ్దుల్ రజాక్ తాత్కాలిక హెడ్ కోచ్ అసిస్టెంట్ కోచ్గా సేవలు అందించబోతున్నారు అన్నది తెలుస్తుంది. అయితే ఇటీవల కొత్త కోచ్ నియమించేందుకు పలువురు ఆటగాళ్ల పేర్లు పిసిబి ప్రయత్నించిన ఆయా ఆటగాళ్ళు ఆసక్తిని కనపరచలేదట. ఈ క్రమంలోనే గ్యారి కిర్ స్టెన్, జాసన్ గిలెప్సి లాంటి మాజీ ఆటగాళ్లను ఇక కోచ్గా నియమించేందుకు క్రికెట్ బోర్డు ప్రయత్నిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: