రుతురాజ్ కి.. ధోని ముందే ఆ విషయం చెప్పుంటాడు : అశ్విన్

praveen
ఎన్నో ఏళ్లపాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోని సారధ్య ప్రస్థానం ఇక 2024 ఐపీఎల్ సీజన్ తో ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఐపీఎల్ సీజన్ కి ముందే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. యువ ఆటగాడు అయినా రుతురాజ్ చేతికి సారధ్య బాధ్యతలను అప్పగించాడు ధోని. దీంతో ఇక ఈ ఐపిఎల్ సీజన్లో మొదటి మ్యాచ్ లో ఋతురాజ్ కెప్టెన్సీ లోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బరిలోకి దిగింది.

 సాధారణంగా మహేంద్ర సింగ్ ధోని ఎంతో గొప్ప వ్యూహకర్త  అన్న విషయం అందరికీ తెలిసిందే. మ్యాచ్ ను ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే తన వ్యూహాలతో తనవైపుకు తిప్పుకుంటూ ఉంటాడు. ఇక ఎంతో కూల్ గా కనిపిస్తూ ప్రత్యర్థులను భయపెడుతూ ఉంటాడు. ఇక ధోని వికెట్ల వెనకాల ఉండి వ్యూహాలు పన్నితే అది సక్సెస్ కాకుండా ఉండదు అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు ధోని తీసుకునే నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపోయే విధంగా ఉంటాయి. కాగా ఇప్పుడు ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని యువ ఆటగాడు అయినా రుతురాజ్ కి ఎందుకు కెప్టెన్సీ అప్పగించాడు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

 అయితే ఇదే విషయం గురించి టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నై కెప్టెన్గా రుతురాజ్ ను ఎంపిక చేయడం తనకు ఆశ్చర్యంగా అనిపించలేదు అంటూ అశ్విన్ తెలిపాడు. ధోని గురించి నాకు బాగా తెలుసు. అతను ఏం చేసినా ఫ్రాంచైజీ బాగు కోసమే. కెప్టెన్సీ విషయమై రుతురాజ్ తో గత ఏడాది చర్చించి ఉంటారు. నాయకత్వ బాధ్యతలపై కంగారు పడొద్దు. నేను కూడా జట్టులోనే ఉంటాను అని ధోని హామీ ఇచ్చి ఉంటారు అంటూ అశ్విన్ చెప్పుకొచ్చాడు. కాగా ఋతురాజు కెప్టెన్గా తొలి మ్యాచ్ లోనే విజయాన్ని అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: