కల్కి మాస్టర్ స్ట్రాటజీ !

Seetha Sailaja
ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్న ‘కల్కి 2898’ విడుదల తేదీని జూన్ 27 అంటూ ప్రకటించిన కొద్దిసేపటికే ప్రభాస్ అభిమానులు తమ హీరో సినిమాకు ఇలాంటి అన్ సీజన్ రిలీజ్ డేట్ ను ఎందుకు ఎంచుకున్నారు అంటూ ఆలోచనలలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీకి జూన్ 27 రిలీజ్ డేట్ ఎంచుకోవడం వెనుక ఈమూవీ నిర్మాతలు మాష్టర్ స్ట్రాటజీని అనుసరిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వస్తున్నాయి.

ఈమూవీని ఎన్నికల తరువాత మే నెలాఖరున విడుదల చేయాలి అనుకుంటే మే నెల ఎంటర్ అవుతున్న పరిస్థితులలో ఈమూవీ ప్రమోషన్ కు సమయం సరిపోదనీ ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు. జూన్ మొదటి వారంలో విడుదల చేయాలి అనకుంటే కమలహాసన్ శంకర్ ల ‘ఇండియన్ 2’ జూన్ 13న విడుదల అవుతున్న పరిస్థితులలో ఆమూవీతో ప్రభాస్ ‘కల్కి’ ని విడుదల చేయడం మంచిది కాదు అన్న ఉద్దేశ్యం ఈమూవీ నిర్మాతలతో పాటు ఈమూవీ బయ్యర్లకు కూడ అభిప్రాయాలు ఉండటంతో ‘కల్కి’ విడుదల తేదీ జూన్ 27గా ఫిక్స్ చేశారు అని అంటున్నారు.

దీనికితోడు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆసమయానికి కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి టిక్కెట్ల రేట్ల పెంపుదల విషయంలో కొత్త ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సమస్యలు లేకుండా జూన్ 27 అన్నివిధాల సరిపోతుందని ఈమూవీ నిర్మాతల నమ్మకం అని అంటున్నారు. సమ్మర్ సీజన్ అంతా ఒక్క సరైన భారీ సినిమా విడుదల లేకుండా గడిచిపోవడంతో జూన్ 27 సలవుల సీజన్ అయిపోయినప్పటికీ టాప్ హీరోల భారీ సినిమాల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు సీజన్ ఆన్ సీజన్ అన్న విషయాలు పట్టించుకోరు అన్న అభిప్రాయంలో ఈమూవీ నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.

దీనికితోడు ‘కల్కి’ నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ‘బాహుబలి’ సెంటిమెంటు కూడ ఉంది అంటున్నారు. ‘బాహుబలి 1’ జూలై 10న ఆన్ సీజన్ లో విడుదల అయినప్పటికీ రికార్డులు క్రియేట్ చేసిన పరిస్తుతులలో తిరిగి అదే సెంటిమెంట్ ‘కల్కి’ విషయంలో కూడ రిపీట్ అవుతుందని ఈమూవీ నిర్మాతల గట్టినమ్మకం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: