టీడీపి: గెలవడం అంత ఈజీ కాదా..?

Divya
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఎలాగైనా గెలుస్తానని చాలా నమ్మకంతో ఉన్నారు. మరొకవైపు మోడీ, పవన్ కళ్యాణ్ అండ ఉన్నారు కాబట్టి కచ్చితంగా తనకి తిరుగుండదనే విధంగా భావిస్తున్నారు.. అయినప్పటికీ జనంలో మాత్రం కూటమికి పెద్దగా ఎక్కడ ఆసక్తి కనిపించడం లేదని బాధ కనిపిస్తోంది.. ముఖ్యంగా బీజేపీతో పొత్తులతో టిడిపి ఈసారి కచ్చితంగా నష్టం జరుగుతుందని వాదన కూడా కూటమిలో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ బలాన్ని నమ్ముకున్న చంద్రబాబు ఎంతో ఊహించుకున్నప్పటికీ అంతస్థాయిలో లేదని సమాచారం కూడా వినిపిస్తోంది.

ఈ విషయంలోనే చంద్రబాబు కాస్త కలవర పడుతున్నట్టుగా కనిపిస్తోంది. బిజెపి టిడిపి జనసేన మూడు పార్టీలు కలిసి 2014 ఎన్నికలలో పోటీ చేశారు.. అయితే ఈ మూడు పార్టీలు కలిసే పోటీ చేశాయి. అప్పుడు టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు గెలవడానికి ముఖ్య కారణం మోడీ ఫ్రెష్గా దేశ రాజకీయాలలోకి వచ్చారు.. అలాగే పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని పెట్టి మొదటిసారి చంద్రబాబుకి మద్దతు పలికారు. కొత్త రాష్ట్రం చంద్రబాబు న్యాయకత్వం పైన నమ్మకం అలాగే పలు రకాలైన పాయింట్లు కూటమిని గెలిపించేలా చేశాయి. అత్యధిక స్థానాలలో గెలవలేకపోయింది టిడిపి.

2014లో 60కి పైగా స్థానాలలో వైసిపి పార్టీ విజయాన్ని అందుకుంది.. అయితే ఇప్పుడు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయిందని ప్రజలు మోదీని పదేళ్లపాటు ప్రధానమంత్రిగా చూశారు..ఈయనకి కొన్నిచోట్ల పాజిటివ్ ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో కాస్త నెగిటివ్ గానే ఉన్నారు. ముఖ్యంగా ఏపీకి అన్యాయం చేశారని ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం, విశాఖ రైల్వే జోన్లు ఏర్పాటు చేయకపోవడం ,క్రిస్టియన్ ,ముస్లిం ఓటర్ల విషయంలో పార్టీ పైన చాలా వ్యతిరేకత ఉన్నది. పవన్ కారణంగా చంద్రబాబు చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ.. పవన్ వైఖరి పార్టీ తీసుకుని నిర్ణయాలతో చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాలో కూడా ఆశించిన స్థాయిలో స్థానాలు వస్తాయని నమ్మకం కూడా కనిపించడం లేదట. ఈసారి జగన్ ని కూడా ఎదుర్కోవడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందనే వాదన చంద్రబాబు సన్నిహితుల వద్ద కూడా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: