ఎన్టీఆర్... హృతిక్ కోసం భారీ సెట్ ను వేస్తున్న "వార్ 2" యూనిట్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ కాంబోలో "వార్ 2" అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది . ఇప్పటికే ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రారంభం అయింది. మొదట ఈ మూవీ బృందం వారు ఎన్టీఆర్ లేకుండా హృతిక్ రోషన్ వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారు. 

ఆ తర్వాత ఈ మూవీ యూనిట్ ముంబై లో ఎన్టీఆర్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు . ఇక పోతే ఈ మూవీ యూనిట్ తదుపరి షెడ్యూల్ ని హైదరాబాదు లోని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది . ఇందులో ఎన్టీఆర్ మరియు హృతిక్ ఇద్దరిపై కూడా సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం . ఇకపోతే హైదరాబాదుబ్లో ఎన్టీఆర్ మరియు హృతిక్ పై ఈ మూవీ యూనిట్ ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.

అందుకోసం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఈ యాక్షన్ సన్నివేశం కోసం భారీ సెట్ ను వేస్తున్నట్లు ఈక్సెట్ లో ఈ చిత్ర బృందం చాలా రోజుల పాటు సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు ,  ఈ యాక్షన్ సన్నివేశం ఈ మూవీ కే హైలెట్ గా నిలవబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మొదటి సారి జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ కలిసి ఓ మూవీ లో నటిస్తూ ఉండడం అది బ్లాక్ బాస్టర్ మూవీ అయినటువంటి "వార్" కి సీక్వెల్ గా రూపొందుతూ ఉండడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో ప్రస్తుతానికి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ లో మరికొన్ని రోజుల్లోనే కియారా అద్వానీ కూడా జాయిన్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: