పాతబస్తీని హైటెక్ సిటీ చేస్తానంటున్న మాధవీలత?

Chakravarthi Kalyan
హైదరాబాద్ పార్లమెంటు ప్రజలు 40 ఏళ్లుగా విసిగిపోయారని.. ఇప్పుడు భాజపా వైపు ప్రజలు చూస్తున్నారన్నారని ఆ పార్టీ హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి మాధవీ లత అంటున్నారు. మజ్లీస్ చేతిలో 40లుగా అభివృద్ధికి నోచుకోని హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని... తనను గెలిపిస్తే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ తరహా లో పాత నగరాన్ని అభివృద్ధి చేస్తానని మాధవీ లత  తెలిపారు. ఆమె పాతబస్తీలో ప్రచారం నిర్వహించారు. దేశం మరింత అభివృద్ధి కావాలంటే... ప్రజలు మరోసారి భాజపా ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ ప్రచారంలో పాల్గొన్న కేంద్ర క్రీడా శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత రాజస్థాన్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ కోరారు.
హైదరాబాద్ పార్లమెంట్ భాజపా ఎంపీ అభ్యర్థి మాధవిలతతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా ప్రచారంలో పాల్గొన్నారు. గత యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంలో దేశంలో రక్షణ వ్యవస్థతో పాటు... అన్ని రంగాలు బ్రష్టు పట్టాయని... కానీ పదేళ్ల మోదీ ప్రభుత్వంలో రక్షణ శాఖ ఆయుధాలను తయారు చేసే స్థాయిలో అభివృద్ధి చెందిందని రాధోడ్‌ అన్నారు. మోదీ ప్రభుత్వంలో 80 దేశాలు మన దేశం నుండి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాయని గుర్తు చేశారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే...  నిర్ణయం ప్రజల చేతుల్లో ఉందని.. భాజపాకి ఓటు వేసి మూడోసారి మోదీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని రాధోడ్‌ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: