ఏపీ: ఆమే వస్తానంటున్నా.. పట్టించుకోని నేతలు..!!

Divya
సినీ సెలబ్రిటీలకు రాజకీయాలకు ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధమంది.. అందుకే చాలామంది సెలబ్రిటీలు కూడా పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న జయప్రద భారతీయ సినీ ప్రేక్షకులకు కలల రాణిగా పేరు సంపాదించింది. అయితే బాలీవుడ్ పరిశ్రమలోకి వెళ్ళిన తర్వాత అక్కడే స్థిరపడిపోయింది. ఉత్తరాంధ్ర రాజకీయాలలోని ఎక్కువగా మెలుగుతోంది జయప్రద. రకరకాల పార్టీలు మారినప్పటికీ భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతోంది. అయితే బిజెపి పార్టీ మాత్రం ఇమెను పెద్దగా పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తనని ఎవరైనా పిలిచినా కూడా వెళ్లి పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నట్లు ఇటీవలే తెలియజేసింది.

జయప్రద తాజాగా తిరుమల దైవ దర్శనానికి వచ్చినప్పుడు దర్శనం కాగానే ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం బాగుండాలని కోరుకుంటారనీ నేను కూడా అలాంటిదే కోరుకున్నాను అంటు తెలియజేస్తోంది జయప్రద.ఏపీకి ప్రత్యేక హోదా రావాలని శ్రీవారిని ప్రార్థించాను అంటూ కూడా పలు విషయాలను తెలియజేస్తోంది.. అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అంటే ప్రార్థించాల్సింది వెంకటేశ్వర స్వామిని కాదు మోడీని అంటూ పలువురు నేతలు కామెంట్స్ చేస్తున్నారు.. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలుగా పురందేశ్వరి తనను ఆహ్వానిస్తే ఖచ్చితంగా ఎన్నికల ప్రచారంలో భాగమవుతారని జయప్రద తెలియజేస్తోంది.

ప్రస్తుతం ఇమే ఖాళీగా ఉండడంతో ఎవరు ప్రచారానికి కూడా పిలవడం లేదట.. ఇలా ప్రచారం చేస్తూ ఉంటే ప్రజలలో కనిపిస్తేనే స్టార్డం అనేది ఉంటుందని లేకపోతే ప్రజలు మర్చిపోతారని భయం సెలబ్రిటీలకు ఉంటుంది. ఇప్పుడు జయప్రద విషయంలో కూడా అదే జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఉత్తరాదిలో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో జయప్రద కు తెలియదు కానీ.. రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం బాగానే పాపులారిటీ సంపాదించింది.. అయినప్పటికీ కూడా ఏపీ బీజేపీ నేతలు తెలంగాణ బిజెపి నేతలు ఈమెను ప్రచారానికి పిలవడం లేదు.. మరి ఇకనైనా పిలుస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: