"బాక్" రన్ టైమ్ లాక్..?

Pulgam Srinivas
తమిళ్ లో తాజాగా "అరుణ్మనై 4" అనే హర్రర్ జోనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ'లో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి తమన్నా , రాసి ఖన్న ప్రధాన పాత్రలలో నటించగా ... సుందర్ సి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీని మే 3 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను బాక్ అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు ప్రకటించారు.

ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ ను బట్టి చూస్తే ఇందులో తమన్నా మరియు తన భర్త ఇద్దరూ అనుకోకుండా చనిపోతారు. ఇందులో తమన్నా దయ్యంలా మారి ఏవో వింత వింత చేష్టలు చేస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా దర్శకుడు అయినటువంటి సుందర్ కూడా ఈ మూవీ లో ఓ పాత్రలో నటించాడు. ఈ సినిమా ట్రైలర్ ను బట్టి చూస్తే సుందర్ ఈ మూవీ లో తమన్నా అన్న పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

అసలు తమన్నా కి , తన భర్తకు ఏమైంది అనే విషయాలను సుందర్ తెలుసుకునే అవకాశాలు ఉన్నట్లు ఈ ట్రైలర్ ద్వారా అర్థం అవుతుంది. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా రన్ టైమ్ ను లాక్ చేశారు. ఈ మూవీ 2 గంటల 28 నిమిషాల నీడివితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ విషయాన్ని కూడా ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bak

సంబంధిత వార్తలు: