రాయలసీమ:KK సర్వే.. అనంతపురం జిల్లా ఏ పార్టీకి పట్టు...!

Divya
ఓటింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులు, నేతలు హోరహోరిగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈసారి గెలుపు మాది అంటే మాది అనే ధీమాతో ముందుకు వెళుతున్నారు.. ఇటివలె వైసిపి మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. కూటమిలో భాగంగా మే ఒకటవ తారీఖున మేనిఫెస్టోను విడుదల చేసేలా ప్లాన్ చేశారు. అయితే ఇప్పటివరకు పలు రకాల సర్వేలు కూడా ఎవరు అధికారం వస్తుందని విషయం పైన క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. ఎవరికి వారు యమునా తీరు అన్నట్టుగా తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా కేకే సర్వీస్ స్ట్రాటజీ ప్రకారం అనంతపురం జిల్లాలో ఏ నియోజకవర్గాలకు ఎక్కడ పట్టు ఉందనే విషయాలని తెలియజేస్తున్నారు. వాటి గురించి చూద్దాం.

కేకే సర్వే 2019 ఎన్నికలలో భాగంగా అంచనా వేసినట్టుగానే జరిగిందని ఈసారి కూడా అలాగే జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. మరి ఈ సర్వే తెలిపిన ప్రకారం.. ఇప్పటివరకు అన్ని ప్రాంతాలు చుట్టము కేవలం అనంతపురం, కర్నూలు, చిత్తూరు  జిల్లాలు మాత్రమే మిగిలి ఉన్నాయని ప్రస్తుతం అనంతపురం జిల్లా గురించి తెలియజేస్తున్నామని తెలుపుతున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి.. గడిచిన ఎలక్షన్స్ లో ఇక్కడ 12 నియోజకవర్గాలలో వైసీపీ పార్టీ గెలిచింది. కేవలం 2 సీట్లనే టిడిపి గెలుచుకుంది.

అయితే ప్రస్తుతం కేకే సర్వే తెలిపిన ప్రకారం.. ఇక్కడ కూటమి 8 స్థానాలలో గెలుచుకుంటుంది.. అది కూడా 10,000 కు పైగా ఓట్ల తేడాతో గెలుస్తుందని గెలుపుతున్నారు. వైసిపి ఒకటి.. పోరా హోరిగా 5 ఉంటాయని తెలుపుతున్నారు. అయితే టఫ్ ఫైట్ అంటే కేవలం 5000 ఓట్లు తేడాతో ఉంటుందని.. ఎలక్షన్ సమయం కేవలం 15 రోజులు మాత్రమే ఉంది కాబట్టి అటు ఇటు అయినా కావచ్చు అని తెలుపుతున్నారు. కేకే సర్వే చెప్పినట్టుగానే ఇప్పటివరకు అన్ని జరిగాయని ఆ సర్వే తెలియజేస్తోంది. అలాగే ఓవరాల్ గా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి వైసిపి పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయం పైన త్వరలోనే తెలియజేస్తామని కూడా తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: