చెత్త యాడ్స్ కోసం.. టీమ్ ని నాశనం చేయకు.. ధోనిపై గంభీర్ ఫైర్?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అందరు క్రికెటర్ల లాగా సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండడు అన్న విషయం తెలిసిందే. కానీ ధోనికి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ మాత్రం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న క్రికెటర్లతో పోచి చూస్తే ధోనినే ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు క్రికెట్ ప్రేక్షకులు. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం పలు వాణిజ్య ప్రకటనలు కోసం ధోని సోషల్ మీడియాను తెగ వాడేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే t20 ప్రపంచ కప్ సమయంలో ధోని ఇక ఒక ఓరియో యాడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 2011లో వన్డే వరల్డ్ కప్ మ్యాజిక్ ను  ఈసారి భారత జట్టు తప్పకుండా రీ క్రియేట్ చేస్తుంది అంటూ ఓరియో యాడ్ చేస్తూ ధోని చెప్పాడు. కానీ ఆ తర్వాత భారత జట్టు సెమీఫైనల్ లో ఓడిపోయి ఇంటికి వచ్చేసింది. దీంతో ధోని యాడ్ పై తీవ్రమైన ట్రోలింగ్స్ కూడా వచ్చాయి. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలోను ధోని ఇదే రకమైన యాడ్ తో వచ్చాడు. మత్ బోలో అంటూ సరికొత్త యాడ్ ని డిజైన్ చేసింది ఓరియో. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా టీం ఇండియా ఓడిపోయింది. అయితే ఇక ఇప్పుడు 2024 t20 వరల్డ్ కప్ కి ముందు మరోసారి బ్రిటానియా కంపెనీ ఒక యాడ్ వదిలింది.

 ఓరియో బిస్కెట్ యాడ్ ని ట్రోల్ చేస్తూ బ్రిటానియా ఈ యాడ్ చేసింది. అయితే ఈసారి మళ్లీ వరల్డ్ కప్ వస్తుంది. ఈ ట్విస్ట్ క్రీమ్ బిస్కెట్ కంపెనీ మళ్ళీ యాడ్ చేస్తుంది. 140 కోట్ల భారతీయుల కోరిక సంబంధించి ఈసారి యాడ్ చేయకండి ప్లీజ్ అంటూ బ్రిటానియా జిమ్ జామ్ బిస్కెట్స్ కోసం యాడ్ చేసి వదిలారు. అయితే ఇక ఈ బిస్కెట్ యాడ్ ని గౌతమ్ గంభీర్ షేర్ చేశాడు అని చెప్పాలి. వరల్డ్ కప్ వస్తుందంటే గెలవాలని అనుకుంటారు. ఆ ప్రెజర్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. 140 కోట్ల మంది ఊపిరి బిగ పట్టుకుని భారత జట్టు కప్పు కలిసే క్షణాల కోసం ఎదురుచూస్తున్నారు. వరల్డ్ కప్ కంటే ఏది ముఖ్యం కాదు. దయచేసి ఇందులో ఎలాంటి ట్విస్ట్ తీసుకురాకండి. యాడ్స్ చేయకండి.. కుర్రాళ్ళను ఆడనివ్వండి అంటూ సోషల్ మీడియాలో స్పందించాడు గౌతమ్ గంభీర్. ఒకరకంగా ధోని యాడ్స్ చేయొద్దు అంటూ ఇండైరెక్టుగా గౌతమ్ గంభీర్ చెప్పేసాడు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: