ధోని తెలివే తెలివి.. ఋతురాజ్ ను ఊరికే కెప్టెన్ చేయలేదు?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో ఛాంపియన్ టీం గా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ లో ప్రస్తుతం కొత్త శకం మొదలైంది. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి కూడా చెన్నై సూపర్ కింగ్స్ కి కెప్టెన్గా కొనసాగుతూ వచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. అతని సారథ్యంలోనే ఏకంగా ఐదుసార్లు టైటిల్ అందుకుంది చెన్నై జట్టు. ఇక ఎక్కువ సార్లు ఫైనల్ ఆడిన టీం గా కూడా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఈ ఏడాది ఐపిఎల్ సీజన్ నుంచి కూడా కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో యువ ఆటగాడిగా కొనసాగుతున్న రుతురాజ్ గైక్వాడ్ ఇటీవల కొత్త కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది జట్టు యాజమాన్యం.

 ఎప్పటిలాగానే మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం విషయంలో ముందుగా కాకుండా కాస్త లేటుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్విస్ట్ ఇచ్చాడు అని చెప్పాలి. అయితే ధోని కెప్టెన్ గా ఉన్నాడంటే చెన్నై సూపర్ కింగ్స్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా అద్భుతంగా రానిస్తుంది అనే నమ్మకం అందరిలో ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు ఋతురాజ్ జట్టును ఎలా హ్యాండిల్ చేయగలడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఇక జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్లతో కూడిన జట్టును.. ఋతురాజ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడటానికి అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా నేడే అతనికి మొదటి పరీక్ష ఎదురు కాబోతుంది అని చెప్పాలి.

 టి20 ఫార్మాట్లో రుతురాజు గైక్వాడ్ కెప్టెన్సీ అనుభవం ఎలా ఉంది అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఐతే టి20 మహారాష్ట్ర, పూనేరి బప్ప జట్లకు సారథ్యం వహించిన అనుభవం ఋతురాజ్ కి ఉంది. ఈ రెండు జట్ల తరఫున 16 మ్యాచ్లకు నాయకత్వం వహించిన ఈ యువ ఆటగాడు తన కెప్టెన్సీలో జట్లకు పది విజయాలను అందించాడు. ఇక ఐదు మ్యాచ్లలో ఋతురాజ్ జట్టును గెలిపించలేకపోయాడు. ఒక మ్యాచ్లో మాత్రం ఫలితం తేలలేదు. ఈ క్రమంలోనే ఎంతో అనుభవం గల సీనియర్లతో కూడిన జట్టును నడిపించాలంటే కెప్టెన్ రుత్ రాజ్ కి ఈ మాత్రం ట్రాక్ రికార్డు సరిపోతుందని.. అతని అభిమానులు అనుకుంటున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: