అతను లేకుంటే.. బుమ్రా ఉండేవాడు కాదు : పార్థివ్ పటేల్

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే కొత్త ప్రతిభను ప్రోత్సహించే ఒక మంచి వేదిక అనే విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాలని తమ సత్తా ఏంటో నిరూపించుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న యువ ఆటగాళ్లు అందరికీ కూడా ఐపీఎల్ అనేది ఒక సువర్ణ అవకాశం గా మారిపోతూ ఉంటుంది. ఐపీఎల్ లో అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లు ఇక తమ లో ఉన్న ప్రతిభను నిరూపించుకుంటూ జాతీయ జట్టుకు సెలెక్ట్ అవుతూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఐపీఎల్ కేవలం ఇలా జాతీయ జట్టు తరఫున ఆడేందుకు అవకాశాలను అందివ్వడమే కాదు.. ఆర్థికంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ కెరియర్ను కొనసాగిస్తుంది. యువ క్రికెటర్లకు ఆర్థిక భరోసాని ఇస్తూ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్ ఎంతోమంది ప్రతిభగల యువ క్రికెటర్లను టీమ్ ఇండియాకు అందించింది. ఇలాంటి వారిలో ప్రస్తుతం జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న బుమ్రా కూడా ఒకరు అని చెప్పాలి. ఐపీఎల్ లో అదరగొట్టడం ద్వారానే టీమ్ ఇండియాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇక ఇప్పుడు ఒక దిగ్గజ బౌలర్గా ఎదిగాడు అని చెప్పాలి.

రోహిత్ శర్మ కెప్టెన్సీలో బుమ్రా ఎంతగానో రాటు తేలాడు. ఇక ఇదే విషయం గురించి టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ప్రోత్సాహం లేకపోయి ఉంటే నేడు టీమ్ ఇండియాకు బుమ్రా లాంటి బౌలర్ ఉండేవాడు కాదు అంటూ పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు. 2017 ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టులో బుమ్రా చేరాడు. కానీ తన ప్రదర్శన అంతంత మాత్రమే ఉంది. దీంతో మేనేజ్మెంట్ అతన్ని పక్కన పెట్టి మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంది. కానీ ఆ సమయంలో రోహిత్ బుమ్రాను నమ్మాడు. అతన్ని వదులుకోకూడదు అంటూ యజమాన్యానికి చెప్పాడు  ఇక ఆ తర్వాత బుమ్రా ఏం చేసి చూపించాడో అందరికీ తెలుసు అంటూ పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: