అప్పుడే రీఎంట్రీ ఇద్దామనుకున్నా.. జై షా వద్దన్నాడు : పంత్

praveen
టీమిండియాలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న రిషబ్ పంత్ గత కొంతకాలం నుంచి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసింది. ఎందుకంటే ఘోరమైన యాక్సిడెంట్ బారిన పడిన రిషబ్ పంత్ తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఏకంగా అతని కాలి ఎముక కూడా విరిగిపోయింది. ఈ క్రమంలోనే ఎన్నో సర్జరీల తర్వాత అతను నడవగలిగాడు అని చెప్పాలి . అయితే ఈ యాక్సిడెంట్ తర్వాత ఇక పంత్ కెరియర్ ముగిసిపోయింది అని అందరూ అనుకున్నారు.

 కానీ ఊహించని రీతిలో రిషబ్ పంత్ పట్టుదలతో కోలుకున్నాడు. అయితే దాదాపు గత సంవత్సరం పాటు ఇక క్రికెట్ కు దూరంగానే ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఇక వైద్యుల సమక్షంలో ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉన్నాడు. అయితే పంత్ రీ ఎంట్రీ ఫై ఎన్నో రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇదిగో వస్తున్నాడు అదిగో వస్తున్నాడు అని వార్తలు తప్ప అతని రీ ఎంట్రీ మాత్రం లేకుండా పోయింది. దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశ చెందుతూనే ఉన్నారు అనే విషయం తెలిసిందే. అయితే మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం రిషబ్ పంత్ మరోసారి బరిలోకి దిగి ఢిల్లీ క్యాపిటల్స్ ని కెప్టెన్గా ముందుకు నడిపించబోతున్నాడు అన్నది తెలుస్తోంది.

 ఈ క్రమంలోనే ఇటీవల తన రీ ఎంట్రీ గురించి రిషబ్ పంత్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండుతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ లోనే తాను ఆడాలని అనుకున్నాను అంటూ స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ తెలిపాడు. అయితే బీసీసీఐ సెక్రటరీ జై షా సూచన వల్లే ఇక ఇంగ్లాండు తో సిరీస్ కి దూరంగా ఉన్నాను అంటూ తెలిపాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ కి ఫిట్గా ఉండేందుకు ప్రయత్నించాను. అయితే ఈ విషయంలో బీసీసీఐ, ఎన్సీఏ సహాయం మరువలేనిది  టెస్టుల్లో ఇప్పుడే ఆడొద్దని ఈ జై షా సూచించారు  ఆయన సలహాతోనే ఇక ఇంగ్లాండ్తో సిరీస్ కి దూరంగా ఉన్నాను  ఇక మరింత విశ్రాంతి తీసుకుని మరి ఇప్పుడు  పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించాను. జై షాకు కృతజ్ఞతలు అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: