ధోని తర్వాత చెన్నై కెప్టెన్ ఎవరు.. ఓనర్ శ్రీనివాసన్ ఏమన్నారంటే?

praveen
టీమిండియా  మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ అటు ఐపిఎల్ లో మాత్రం ఆడుతూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన నాటి నుంచి కూడా ఐపీఎల్ కు సైతం రిటైర్మెంట్ ప్రకటిస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ ప్రతి సీజన్లో కూడా ధోని ఇక కొనసాగుతూనే వస్తున్నాడు. గత ఏడాది ఏకంగా అతని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ కి టైటిల్ కూడా అందించాడు అని చెప్పాలి.  ఈసారి కూడా ఐపీఎల్ లో ఆడేందుకు సిద్ధమయ్యాడు.

 అయితే వయస్సు రీత్యా చూసుకుంటే మహేంద్రసింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో ఒకవేళ ధోని ఐపిఎల్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కు సారధిగా మారబోయే ఆటగాడు ఎవరు అనే విషయంపై కూడా చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్లేయర్ల పేర్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంపై అటు జట్టు ఓనర్ శ్రీనివాసన్ కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాక ఇటీవలే ఆయన చేసిన కామెంట్స్ మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యూచర్ కెప్టెన్ గురించే అన్న విషయం అందరికీ అర్థమవుతుంది.

 ధోని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలను ఎవరు భర్తీ చేస్తారు అనే విషయంపై చర్చ జరుగుతూ ఉండగా.. ఈ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓనర్ శ్రీనివాసన్ స్పందించారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ నియామకాలపై చర్చించవద్దు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఆ విషయం జట్టు కెప్టెన్ కోచ్లకే వదిలేస్తాము అంటూ తెలిపాడు ఆయన. ఈ క్రమంలోనే ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అన్న విషయంపై అటు ధోనిదే తుది నిర్ణయం అన్న విషయాన్ని జట్టు ఓనర్ శ్రీనివాసన్ చెప్పకనే చెప్పారు అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. అయితే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న ఋతురాజు గైక్వాడ్ కి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: