ఫైనల్ వరకు దూసుకొచ్చి.. ఇక్కడ తుస్సుమందేంటి?

praveen
దేశవాళి క్రికెట్లో రంజీ ట్రోఫీని ఎంతో ప్రతిష్టాత్మకమైన టోర్నీగా పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పట్లో అయితే అటు ఐపీఎల్ కి విపరీతమైన క్రేజ్ పెరిగిపోవడంతో రంజీలను పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ ఒకప్పుడు ఇక భారత జాతీయ జట్టు తర్వాత ఇక రంజీ ట్రోఫీకే ఎక్కువగా గుర్తింపు ఉండేది. అయితే జాతీయ జట్టులో చోటు దక్కని ఆటగాళ్లు కనీసం రంజీ ట్రోఫీ వరకు అయినా తమ కెరియర్ను కొనసాగించాలని ఆశపడుతూ ఉండేవారు అని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం రంజీ ట్రోఫీ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది.

 ఎన్నో రోజుల నుంచి ప్రేక్షకులకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతూ వస్తున్న ఈ ప్రతిష్టాత్మకమైన దేశ వాలి టోర్నీ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే టోర్నీ మొత్తంలో కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తే ప్రత్యర్థులను ఓడిస్తూ దూసుకు వచ్చాయి విదర్భ, ముంబై జట్లు. ఈ క్రమంలోనే ఫైనల్ లో హోరాహోరీగా తలబడుతున్నాయి అని చెప్పాలి. అయితే అప్పటివరకు జరిగిన లీగ్ దశలో అద్భుతంగా రాణించిన విదర్భ ఎందుకొ ఫైనల్ మ్యాచ్లో మాత్రం తడబాటుకు గురైంది.

 దీంతో ఆ జట్టు అభిమానులు అందరూ  కూడా నిరాశలో మునిగిపోతున్నారు అని చెప్పాలి  అప్పటికే ఎన్నోసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా ఉన్న ముంబైకి ఫైనల్లో సరైన పోటీ ఇవ్వలేకపోతోంది విదర్భ. ప్రస్తుతం ముంబై తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో కేవలం 105 పరుగులకే ఆల్ అవుట్ అయింది విదర్భ జట్టు. దీంతో ముంబైకి తొలి ఇన్నింగ్స్ ముఖ్య సరికి 119 పరుగులు ఆదిక్యం లభించింది. కాగా తొలి ఇన్నింగ్స్ లో ముంబై జట్టు 224 పరుగులు చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే రెండవ ఇన్నింగ్స్ లో అయినా విదర్భ పుంజుకొని ఫైనల్లో విజయం సాధించాలని ఆ జట్టు అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: