ధర్మవరం: సత్యకుమార్ కు శ్రీరామరక్ష కరువు.. జోరు వైసీపీదేనా.?

Pandrala Sravanthi
ఏపీలో ఎలక్షన్స్ టైం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది.  విత్ డ్రాకు ఈరోజు మాత్రమే టైముంది. అలాంటి ఈ తరుణంలో  175 నియోజకవర్గాల్లో అభ్యర్థులంతా  జోరుగా ప్రచారంలో మునిగిపోతున్నారు. ఈ క్రమంలోనే ధర్మవరం నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి డిఫరెంట్ గా ఉంది. కూటమిలో కొట్లాటలు మొదలయ్యాయి. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం. ధర్మవరం నియోజకవర్గం లో కూటమి అభ్యర్థిగా  బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కు టికెట్ ఖరారు చేశారు. అప్పటి నుంచి అక్కడ టిడిపిలో గొడవలు మొదలయ్యాయి. 

అతను స్థానికుడు కాకపోవడం, నియోజకవర్గంపై పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల  ప్రచారంలో చాలా సమస్యలు ఏర్పడుతున్నాయట.  అయినా సత్యకుమార్ ఎలాగోలా ప్రచారాన్ని ముందుకు సాగిస్తున్నారు. అయితే ధర్మవరంలో బీజేపీ కి ఏమాత్రం పట్టులేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా లేదు. అలాంటి బీజేపీ పార్టీకి అక్కడ టికెట్ ఇవ్వడంతో  టిడిపి జనసేన అభ్యర్థులు కూటమి పై అలిగారట. అంతే కాకుండా  ఇంతకుముందు టిడిపి నుంచి బీజేపీ లో చేరిన మాజీ ఎమ్మెల్యే జి సూర్యనారాయణ  ధర్మవరంలో 2014లో పోటీ చేసి గెలిచారు. 2019లో టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బీజేపీ లో చేరి టికెట్  ఆశించారు. కట్ చేస్తే ఎన్నో ఏళ్లుగా ధర్మవరం నియోజకవర్గం లో టిడిపిని పట్టుకొని  ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ కూడా టికెట్ వస్తుందనుకున్నారు. కానీ చివరి నిమిషంలో శ్రీరామ్ కు గానీ, సూర్యనారాయణకు గానీ టికెట్టు ఇవ్వకుండా కొత్త అభ్యర్థి సత్య కుమార్ కు  కూటమి టికెట్ ఇచ్చారు. దీంతో శ్రీరామ్ మద్దతుదారులు సూర్యనారాయణ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మరో బలమైన అభ్యర్థి మధుసూదన్ రెడ్డి కూడా  జనసేన తరఫున టికెట్ ఆశించారు. ఈయన కూడా సత్యకుమార్ కు దూరంగానే ఉంటూ వస్తున్నారు. తాజాగా శ్రీరామ్,సత్య కుమార్ తో కలిసిపోయి  కూటమి నిర్ణయం ప్రకారం మేము ఆయనతో కలిసిపోయి ప్రచారంలో తిరుగుతున్నట్టు తెలిపాడు.

అయితే పైకి మాత్రమే అలా కనిపిస్తున్నారు  లోపల మాత్రం ఆయన సపోర్ట్ చేసే అవకాశం ఏమాత్రం లేదని అంటున్నారు అక్కడి జనాలు. అంతేకాకుండా సూర్యనారాయణ,మధుసూదన్ రెడ్డిలు కూడా కాస్త అలిగినట్టే ఉన్నారు. ఈ విధంగా సత్యకుమార్ కు  ధర్మవరంలో సపోర్ట్ తక్కువయింది. దీంతో వైసిపి నుంచి పోటీ చేస్తున్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటూ సోషల్ మీడియాలో  వైరల్ అయ్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి  ఆ నియోజకవర్గమంతా చాలా సుపరిచితుడు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు . మూడోసారి కూడా గెలవాలని చూస్తున్నారు. అలాంటి ఈ బలమైన నేతను  పడగొట్టాలి అంటే సత్యకుమార్, శ్రీరామ్,మధుసూదన్, సూర్యనారాయణ ఇలా అంతా కలిసి  కట్టుగా ప్రచారం చేస్తే తప్ప టిడిపి గెలవడం కష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: