టెస్ట్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఒక్క సిరీస్ లో ఎన్ని సిక్సర్లు కొట్టారో తెలుసా?

praveen
గత కొన్ని రోజుల నుంచి ఇంగ్లాండ్, ఇండియా జట్ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా జరిగిన టెస్ట్ సిరీస్ ఇటీవలే ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఏకంగా నాలుగింటిలో భారత జట్టు విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించిన ఇంగ్లాండు జట్టు ప్రస్తుతం విమర్శలు ఎదుర్కొంటుంది అని చెప్పాలి. అయితే ఈ టెస్ట్ సిరీస్ మొత్తం ఎంతో ఆసక్తికరంగా సాగింది. బజ్ బాల్ అనే ఎటాకింగ్ గేమ్ తో ఇంగ్లాండ్.. ఇక తమదైన ఆట తీరుతో ఇండియా  హోరాహోరీగా పోరాడాయి అని చెప్పాలి.

 అయితే ఇంగ్లాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో అవకాశం దక్కించుకున్న యువ ఆటగాళ్లు  ఈ సిరీస్ మొత్తంలో ఇంగ్లాండ్ అవలంబిస్తున్న బజ్ బాల్ ఆట తీరును మించిన దూకుడుతో బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే సిక్సర్ లో ఫోర్ లతో చెలరేగిపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారీ స్కోర్లు కూడా నమోదు అయ్యాయి. ఎన్నో అరుదైన రికార్డులు కూడా బద్దలు అయ్యాయి అని చెప్పాలి. అయితే ఇక ఇంగ్లాండ్, టీమిండియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ కూడా ఓ అరుదైన రికార్డును  బద్దలు కొట్టింది అన్నది తెలుస్తుంది. ఏకంగా టెస్ట్ చరిత్రలో 100 సిక్సులు నమోదైన తొలి సిరీస్ గా రికార్డు సృష్టించింది ఇటీవలే ముగిసిన ఇండియా, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్.

 ఏకంగా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భారత ప్లేయర్లు 72 సిక్సర్లతో చెలరేగిపోయారు. అయితే బజ్ బాల్ క్రికెట్ అంటూ హైప్ క్రియేట్ చేసిన ఇంగ్లాండ్ ప్లేయర్లు మాత్రం కేవలం 28 సిక్సర్లు మాత్రమే కొట్టడం గమనార్హం. ఇక దీన్ని బట్టి ఇక ఈ టెస్ట్ సిరీస్ లో భారత బ్యాట్స్మెన్ల విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు . మరీ ముఖ్యంగా యశస్వి జైష్వాల్ అయితే తన దూకుడైన ఆట తీరుతో టెస్ట్ ఫార్మాట్ ఆటను రానున్న రోజుల్లో మార్చేలాగే కనిపించాడు. రెండు డబుల్ సెంచరీలు 5 హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయాడు అని చెప్పాలి. సాధారణంగా టెస్ట్ ఫార్మాట్ లో అందరూ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తారు. కాబట్టి ఎక్కువగా సిక్సర్లు నమోదు అవ్వవు. కానీ ఇటీవలే ఒక్క సిరీస్ లోనే 100 సిక్సర్లు నమోదు కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: