షాకింగ్ : పాకిస్థాన్ హెడ్ కోచ్ గా.. ధోని జట్టు ప్లేయర్?

praveen
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీ లో పాకిస్తాన్ జట్టు తీవ్రంగా విఫలం అయ్యింది. ఎందుకంటే సెమీఫైనల్ లో కూడా అడుగుపెట్టలేక ఇక ఇంటి బాట పట్టింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి అని చెప్పాలి. అయితే ఇలా వరల్డ్ కప్ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించి పాకిస్తాన్ జట్టు అటు సొంత గడ్డపై అడుగుపెట్టిందో లేదో అంతలోనే ఏకంగా కెప్టెన్సీ మార్పు కూడా జరిగింది. బాబర్ వరల్డ్ కప్ ఓటమికి బాధ్యత వహిస్తూ సారాధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

 ఇక ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇక కోచింగ్ సిబ్బంది అందరిని కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా స్వదేశీ మాజీ ఆటగాళ్లనే కొత్తకోచులు గా నియమించింది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఒక్కో ఫార్మాట్ కి ఒక్కొక్క కెప్టెన్ ను నియమిస్తూ  నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. అయినప్పటికీ పాకిస్తాన్ ఆటతీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. రోజురోజుకి పాక్ ఆట అద్వానంగా మారిపోతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో  పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అశ్రఫ్ సైతం రాజీనామా చేయడం మరింత సంచలనంగా మారిపోయింది. దీంతో ఇక పాకిస్తాన్ క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా ఊహించనీ విధంగానే మారిపోయింది పరిస్థితి.

 అయితే ఇక ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ వచ్చాడు అన్నది తెలుస్తుంది. ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ అయిన షైన్ వాట్సన్ ఇక పాకిస్తాన్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ గా నియమించ పోతుందట ఆ దేశ క్రికెట్ బోర్డు. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతనితో సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది  ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ లో క్విట్ట గ్లాడియేటర్స్ జట్టుకి వాట్సన్ హెడ్ కోచ్గా కొనసాగుతూ ఉన్నాడు. ఒకవేళ కోచ్ పదవికి వాట్సన్ నో చెబితే వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారేన్ సమీని హెడ్ కోచ్ పదవికి నియమించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇండియా వేదికగా జరిగిన  వరల్డ్ కప్ ముగిసిన నాటి నుంచి పూర్తిస్థాయి కోచ్ లేకుండానే మ్యాచ్లు ఆడుతుంది పాకిస్తాన్ జట్టు. కాగా షైన్ వాట్సన్ గతంలో ఐపీఎల్లో చెన్నై జట్టు తరఫున ఆడాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: