క్లీన్ బౌల్డ్.. అయినా రివ్యూ తీసుకున్న బ్యాట్స్మెన్?

praveen
గత కొన్ని రోజుల నుంచి ఇంగ్లాండ్, టీమిండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఇటీవలే ముగిసింది అన్న విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా ఇక భారత జట్టుకు సొంత గడ్డమీద షాక్ ఇవ్వడానికి వచ్చిన ఇంగ్లాండ్ కు బిగ్ షాప్ తగిలింది. ఎందుకంటే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఏకంగా నాలుగు ఇంటిలో ఓడిపోయి ఇక తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటుంది టీమ్ ఇండియా. ఇక ఇటీవలే ధర్మశాల వేదికగా జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో ఏకంగా 64 పరుగుల తేడాతో టీమిండియా ఇంగ్లాండ్ ను చిత్తుగా ఓడించింది అన్న విషయం తెలిసిందే. దీంతో 4-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.

 అయితే ఇంగ్లాండు, టీం ఇండియా జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా మారిపోయింది అని చెప్పాలి.  అయితే చివరి టెస్ట్ మ్యాచ్లో మూడోరోజు ఆట సందర్భంగా ఒక ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. ఇక ఈ సంఘటనతో అటు టీమిండియా ఇటు ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందరూ కూడా ఒక్కసారిగా నవ్వుకున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా ఇంగ్లాండ్ ఆటగాడు షోయబ్ బషీర్ రివ్యూ తీసుకున్న విధానం అందరినీ అవాక్కయ్యేలా  చేసింది. సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో ఆటగాళ్లు రివ్యూలు తీసుకోవడం కామన్.

 బంతి ప్యాడ్ లకు తగిలినప్పుడు ఎల్బీడబ్ల్యూ అప్పీల్ చేస్తే ఇక అంపైర్ అవుట్ ఇస్తే.. ఎంపైర్ నిర్ణయం పై ఏదైనా అనుమానాలు ఉన్నప్పుడు బ్యాట్స్మెన్లు రివ్యూ తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఏకంగా బంతి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసి క్లీన్ బౌల్డ్ అయిన తర్వాత ఎవరైనా రివ్యూ తీసుకుంటారా.. క్లీన్ బౌల్డ్ అయిన తర్వాత ఇంకా రివ్యూ తీసుకోవడానికి ఇంకేముంటుంది అంటారు ఎవరైనా.. కానీ ఇక్కడ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ మాత్రం ఏకంగా క్లీన్ బౌల్డ్ అయిన తర్వాత కూడా రివ్యూ తీసుకున్నాడు. 46వ ఓవర్ చివరి బంతి షోయబ్ బషీర్ ఆఫ్ వికెట్ తగిలి కీపర్ చేతుల్లో పడింది. కానీ దీనిని బషీర్ గమనించలేదు. వికెట్ కీపర్ క్యాచ్ అందుకున్నాడు అని భావించి బషీర్ ఏకంగా డిఆర్ఎస్ కావాలి అంటూ కోరాడు. కానీ నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న జో రూట్ నవ్వుతూ బోల్డ్ అయినట్లు చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: