మూడు నెలల పాటు.. టీమిండియాకు మ్యాచుల్లేవ్?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియా జట్టు ఇక వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో  ఎంతలా బిజీబిజీగా గడిపిందో ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. ఇక అందరూ ప్లేయర్లు కూడా నిర్విరామంగా క్రికెట్ ఆడుతూ వచ్చారు. ఈ క్రమంలోనే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా బీసీసీఐ కొంతమంది ఆటగాళ్లకు మధ్యలో కొన్ని రోజులపాటు విశ్రాంతి ఇవ్వడం కూడా చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుతో కూడా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను ముగించుకుంది టీమ్ ఇండియా. ఇక అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్తో టి20 సిరీస్ ఆడింది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇక ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా వరుసగా నాలుగు మ్యాచ్లలో విజయం సాధించిన టీమిండియా 4-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుని ఘనవిజయాన్ని అందుకుంది. అయితే ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన నేపథ్యంలో ఇక టీం ఇండియా షెడ్యూల్ ఏంటి అనే విషయంపై అందరూ దృష్టిపడింది. ఈ క్రమంలోనే మూడు నెలల పాటు టీమిండియా కు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్లు లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే టీమిండియా నేరుగా వరల్డ్ కప్ లో బరిలోకి దిగబోతుంది. జూన్ 5వ తేదీన టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్తో భారత జట్టు తలబడబోతుంది అని చెప్పాలి.

అయితే ఇలా నేరుగా టీమిండియా ఆటగాళ్లు అటు ఆ వరల్డ్ కప్ లో బరిలోకి దిగుతూ ఉండడం కాస్త ఆందోళన కలిగించే అంశం అయినప్పటికీ.. ఇక మార్చ్ 22వ తేదీ నుంచి జరగబోయే ఐపీఎల్ మాత్రం ఆటగాళ్లకు ఒక మంచి ప్రాక్టీస్ గా మారబోతుంది. ఎందుకంటే టీమిండియాలో ఉన్న అందరూ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లోనే వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక ఈ టోర్నీకి ఎలాంటి ఆటంకం ఏర్పడకుండా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఇలా మూడు నెలల పాటు టీమిండియా ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడకపోయినప్పటికీ ఇక అటు ఐపీఎల్ ద్వారా మంచి ప్రాక్టీస్ దొరుకుతుంది. దీంతో ఐపీఎల్ ముగిసిన వెంటనే నేరుగా టీమిండియా ఇక వరల్డ్ కప్ కోసం అమెరికా వెళ్లే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: