అందరూ ఐపీఎల్ ను ఇష్టపడటానికి.. అసలు కారణం అదే : కోహ్లీ

praveen
ప్రస్తుతం ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కు సంబంధించిన హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించింది. మార్చి 22వ తేదీ నుంచి కూడా ఈ మెగా టోర్ని ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఇక అన్ని జట్లు కూడా ఈసారి టైటిల్ విజేతగా నిలవడమే లక్ష్యంగా అస్త్ర శస్త్రాలను కూడా సిద్ధం చేసుకున్నాయ్. ఈ క్రమంలోనే పక్క ప్రణాళికలతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి. ఇక కొన్ని జట్లు తమ టీం లోని ఆటగాళ్ళు అందరిని కూడా క్యాంపులో చేర్చుకునే పనులతో బిజీగా ఉన్నాయ్.

 ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి సంబంధించిన హడావిడి మొదలైన నేపథ్యంలో.. ఎక్కడ చూసినా కూడా ఇదే విషయంపై చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఎంతోమంది స్టార్ ప్లేయర్లు కూడా వివిధ స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఐపీఎల్ గురించి పల ఆసక్తికర విషయాలను కూడా పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఐపీఎల్ టోర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 ఇటీవల కాలంలో స్వదేశీ క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా ఐపీఎల్ టోర్నినీ  ఎక్కువగా ఇష్టపడుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఆటగాళ్లు ఐపిఎల్ ఎక్కువగా ఇష్టపడటానికి ఒక కారణం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ టోర్నిలో ప్లేయర్ల మధ్య స్నేహం బాగుంటుంది. ఐసీసీ తో టోర్నిలలో అలా ఉండదు. ఐపీఎల్ లో ప్రతి మూడు రోజులకు ఒక జట్టు చొప్పున అన్ని జట్లను కలుస్తూనే ఉంటాము. అదే ఐపీఎల్ ప్రత్యేకత. వేరువేరు జట్లతో వేరు వేరు వేదికల్లో వేరు వేరు పరిస్థితుల మధ్య మ్యాచులు జరుగుతూ ఉంటాయి. అందుకే నేను కూడా ఐపీఎల్ ని అమితంగా అభిమానిస్తూ ఉంటాను అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: