బీసీసీఐ నిర్ణయంపై.. గౌతమ్ గంభీర్ ఏమన్నాడో తెలుసా?

praveen
గత కొంతకాలం నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి అంతర్జాతీయ క్రికెట్లో విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. క్రికెటర్ల దగ్గర నుంచి అటు ప్రేక్షకుల వరకు అందరూ కూడా పరిమిత ఓవర్ల  ఫార్మాట్ ను చూడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎంతో మంది క్రికెటర్లు అటు సాంప్రదాయమైన క్రికెట్ గా పిలుచుకున్న టెస్టు ఫార్మాట్ ఆడటం విషయంలో పెద్దగా ఆసక్తిని కనబరచడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే టెస్ట్ ఫార్మాట్ భవితవ్యం ప్రమాదంలో పడిపోతుంది అని గత కొంతకాలం నుంచి ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టెస్ట్ ఫార్మాట్ ను కాపాడాల్సిన అవసరం ఉందని.. దీనిపై ఐసీసీ దృష్టి పెడితే బాగుంటుంది అంటూ ఎంతో మంది అభిప్రాయపడ్డారు అన్న విషయం తెలిసిందే  అయితే ఇక ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ ను కాపాడటమే లక్ష్యంగా అటు బీసీసీఐ ముందుకు సాగుతోంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి కూడా ఇక దేశవాళి క్రికెట్ తో పాటు టెస్ట్ ఫార్మాట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న క్రికెటర్ల విషయంలో కాస్త కఠిన చర్యలు చేపడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇటీవలే మరో సంచలన నిర్ణయానికి శ్రీకారం చుట్టింది బీసీసీఐ. ఏకంగా టెస్ట్ ఫార్మాట్ మ్యాచ్ ఫీజును పెంచేందుకు నిర్ణయించింది అని చెప్పాలి.

 అయితే మొన్నటి వరకు టెస్ట్ ఫార్మాట్లో ఒక మ్యాచ్  ప్లేయర్లకు 15 లక్షలు చొప్పున పారితోషకం అందిస్తూ వస్తుంది బీసీసీఐ. కానీ ఇప్పుడు ఈ మ్యాచ్ ఫీజును ఏకంగా 45 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది  అయితే 45 లక్షలు చెల్లించే విషయంలో కూడా అటు కొన్ని రూల్స్ పెట్టింది బీసీసీఐ. ఇక ఇదే విషయంపై స్పందించిన గౌతమ్ గంభీర్ బిసిసిఐ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశాడు. పనికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది   ఇది మంచి నిర్ణయం అంటూ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు గౌతం గంభీర్. అయితే ఒక సంవత్సరంలో జరిగే టెస్ట్ మ్యాచ్లలో 75% మ్యాచ్లకు హాజరవుతూనే ఆయా ఆటగాళ్లకు మ్యాచ్ కి 45 లక్షలు చొప్పున బీసీసీఐ ఫీజు చెల్లించనుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: