శ్రేయస్, ఇషాన్ ను కాదని.. హార్దిక్ కు సెంట్రల్ కాంట్రాక్ట్.. ఎందుకో చెప్పిన బిసిసిఐ?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్ లో పోటీ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ క్రికెటర్ లు అటు భారత జాతీయ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్న.. ఇంకెంతమంది యువ క్రికెటర్లు తాము కూడా ఎక్కడ తక్కువ కాదు అని దేశవాళీ క్రికెట్లో నిరూపిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక వాళ్లకు అవకాశాలు ఇవ్వడం తప్ప వేరే ఛాన్స్ లేకుండా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జాతీయ జట్టుకు సెలెక్టర్లుగా వ్యవహరించేవారు అటు దేశవాళి క్రికెట్లో బాగా రాణిస్తున్న ఆటగాళ్లను ఇక జాతీయ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం కల్పిస్తూ ఉండడం కూడా ఇటీవలే కాలంలో చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆటగాళ్లు భారత జట్టులోకి కూడా వస్తూ ఉన్నారు.

 అయితే మరోవైపు ఇక భారత జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు ఎవరైతే అటు దేశవాళీ క్రికెట్ ని పక్కన పెడుతూ.. వస్తున్నారో వారిపై అటు బీసీసీఐ కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఇక ఈ ఏడాది సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలను ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. అయితే ఇందులో స్టార్ ప్లేయర్స్ గా కొనసాగుతున్న శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ పేర్లు లేకపోవడం చర్చనీయంశంగా మారిపోయింది. అయితే ఈ ఇద్దరు ప్లేయర్లను తొలగించడంతో ఇక మరికొంతమంది పేర్లు కూడా తెర మీదికి వచ్చాయ్.. ఆయా ఆటగాళ్లను ఎందుకు తొలగించలేదు అంటూ టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా బీసీసీఐపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి హార్దిక్ పాండ్యా కూడా క్రికెట్ కి దూరంగానే ఉంటున్నాడు.

 కానీ అతనికి మాత్రం బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ అందించింది. అయితే హార్దిక్ పాండ్యాకు ఇలా సెంట్రల్ కాంట్రాక్టు ఇవ్వడం పై బీసీసీఐ ఉన్నత అధికారి ఒకరు వివరణ ఇచ్చారు. కాంట్రాక్టు గురించి హార్దిక్ తో చర్చలు జరిపాము. ఇంటర్నేషనల్ మ్యాచ్ లు లేనప్పుడు దేశవాళి టోర్నీలో ఆడతానని అతను హామీ ఇచ్చాడు. ప్రస్తుతం అతను బౌలింగ్ చేసే స్థితిలో లేడు. అందుకే రాంజీల్లో ఆడటం లేదు. భవిష్యత్తులో మాత్రం దేశవాళి టోర్నీలతో పాటు వైట్ బాల్ క్రికెట్ లో కూడా ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ అతను ఆడలేని పక్షంలో తప్పకుండా అందరిలాగానే అతను కూడా సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోతాడు. ఇక ఈ విషయాన్ని అతనికి ముందే హెచ్చరించామని ఒక బీసీసీఐ అధికారి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: