రోహిత్ సేన నాలుగో టెస్ట్ గెలిచిందా.. చరిత్ర సృష్టించినట్టే?

praveen
ప్రస్తుతం ఇంగ్లాండ్, టీమిండియా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఎంతో రసవత్తరంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక వరల్డ్ క్రికెట్లో రెండు అగ్రశ్రేణి టీమ్స్ అయినా ఈ రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లుగానే హోరాహోరీగా తలబడుతూ ఉన్నాయి. అయితే ఏకంగా మొదటి టెస్ట్ లో భారత జట్టును సొంత గడ్డ మీదే ఓడించి ఊహించని షాక్ ఇచ్చింది ఇంగ్లాండ్ జట్టు. అయితే ఇక ఆ తర్వాత రెండు మ్యాచ్లు మాత్రం భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది అని చెప్పాలి.

 విశాఖ సహా రాజ్కోట్ వేదికలుగా జరిగిన రెండు, మూడు టెస్ట్ మ్యాచ్ లలో భారత జట్టు ఘనవిజయాన్ని సాధించింది. మరి ముఖ్యంగా రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్లో అయితే 424 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. దీంతో ఇక ఘోరం ఓటమి చవిచూసిన ఇంగ్లాండు జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఇప్పుడు ఇదే జోరులో నాలుగో టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించి ఇక టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తుంది భారత జట్టు. అయితే నాలుగో  టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ ను ఓడించింది అంటే ఏకంగా ఇంగ్లాండ్ అనుసరిస్తున్న బజ్ బాల్ కు షాక్ ఇచ్చినట్లే అని చెప్పాలి.

 ఎందుకంటే ఇంగ్లాండు జట్టు కోచ్ గా మెకళ్ళమ్ వెళ్ళినప్పటి నుంచి ఇంగ్లాండ్ టీం బజ్ బాల్ క్రికెట్ ఆడుతుంది. అంటే దూకుడుగా ఆడుతూ ఏకంగా ప్రత్యర్థి పై  ఎదురుదాడికి దిగుతూ ఉంది. అయితే 2023 నుంచి ఇప్పటివరకు బజ్ బాల్ విధానం ద్వారా 7 టెస్ట్ సిరీస్ ఆడింది ఇంగ్లాండ్ జట్టు. కానీ ఒక్కసారి కూడా ఇంగ్లీష్ టీం ఓడిపోలేదు. ఇక ఇప్పటివరకు ఆడిన ఏడు టెస్ట్ సిరీస్లలో  నాలుగింటిలో విజయం సాధించగా.. మూడు టెస్టులు ముగిసాయి. అయితే అదే సమయంలో గత 12 ఏళ్ల నుంచి భారత జట్టు కూడా ఇండియా వేదికగా జరిగిన ఒక్క టెస్టులో కూడా ఓడిపోలేదు. దీంతో ఇక నేడు ప్రారంభం కాబోయే  నాలుగో టెస్టులో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: