టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్ వచ్చేసాడు.. ఈసారి ఎవరంటే?

praveen
ఇటీవల కాలంలో టీమిండియాలో యువ ఆటగాళ్ల హవా ఎక్కువైపోయింది అన్న విషయం తెలిసిందే. దేశవాలి క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్ళకు సెలెక్టర్లు వరుసగా అవకాశాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్ల కోసం ఎంతో అనుభవం ఉన్న సీనియర్ ప్లేయర్లను సైతం పక్కన పెట్టేందుకు వెనకడుగు వేయడం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా భారత జట్టులోకి వచ్చిన ఎంతో మంది యంగ్ ప్లేయర్లు తమ సత్తా ఏంటో నిరూపించుకొని జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.

 ఇక ఇలాగే ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అవకాశం దక్కించుకున్న యశస్వి జైష్వాల్ ఏకంగా డబుల్ సెంచరీలతో చెలరేగిపోతున్నాడు. సీనియర్ ప్లేయర్లు అందరూ కూడా విఫలమవుతున్న వేళ యశస్వి జైష్వాల్ మాత్రం తన బ్యాటింగ్ విధ్వంసంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందిస్తూ ఉన్నాడు. అంతేకాదు వన్డే ఫార్మాట్ తరహాలో దూకుడైన బ్యాటింగ్తో ఆకట్టుకుంటున్నాడు అని చెప్పాలి. ఇకపోతే ఇంగ్లాండ్ తో 3 టెస్ట్ మ్యాచ్లను ముగించుకున్న టీమిండియా ఇక ఇప్పుడు నాలుగో టెస్ట్ మ్యాచ్ ప్రారంభించింది. ఇక నాలుగో టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది భారత జట్టు.

 ఇకపోతే ఇటీవల నాలుగో టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా భారత జట్టులోకి మరో కొత్త ఆటగాడు వచ్చేసాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా స్టార్ బౌలర్ బుమ్రాకి విశ్రాంతి ఇవ్వగా.  ఇక అతని స్థానంలో ఆకాష్ దీప్ అరంగేట్రం చేశాడు. ఆవేష్ ఖాన్ కు ఛాన్స్ వస్తుందని అనుకున్నప్పటికీ.. ఇక యువ ఆటగాడు ఆకాష్ దీప్ వైఫై సెలెక్టర్లు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే ఇటీవలే రోహిత్ శర్మ చేతుల మీదుగా అతను టీమిండియా క్యాప్ అందుకున్నాడు అని చెప్పాలి. ఇక జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు ఎలా భారత జట్టులో రాణిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: