యూఏఈ జట్టుకి.. హెడ్ కోచ్ గా మారిన భారత మాజీ?

praveen
సాధారణంగా ఒక జట్టు అద్భుతమైన ప్రదర్శన చేయడానికి ఇక అద్వితీయమైన విజయాలు సాధించడానికి వెనుక కేవలం ఆటగాళ్ల కష్టం మాత్రమే ఉంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ తెరమీద కనిపించని కష్టం మరొకటి ఉంటుంది. అదే కోచ్ ఏకంగా కోచ్ ఆటగాళ్ళ  నైపుణ్యాలను మెరుగుపరచడంలో వారిలోని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఎప్పుడు కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు. ఆటగాళ్లకు ఎప్పటికప్పుడు సరికొత్త మెలకువలను నేర్పిస్తూ అత్యుత్తమంగా రాణించేందుకు తోడ్పాటును అందిస్తూ ఉంటాడు.

 సరైన శిక్షణ ఉన్నప్పుడు మాత్రమే ఆటగాళ్లు అద్భుతంగా రాణించేందుకు అవకాశం ఉంటుంది అన్న విషయం తెలిసిందే  ఈ క్రమంలోనే ప్రతి జట్టు విజయంలో కూడా కోచ్ అనేవాడు ఎంతో కీలకము. అయితే ఇక భారత జట్టు తరఫున ఒకప్పుడు క్రికెటర్గా సేవలు అందించిన ఎంతోమంది ప్లేయర్లు ఇక ఇప్పుడు ఇతర దేశాలకు చెందిన క్రికెట్ జట్లకు కోచ్ లుగా వ్యవహరిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక గతంలో ఆఫ్ఘనిస్తాన్ తో పాటు జింబాబ్వే జట్టుకు కూడా కోచ్గా సేవలు అందించిన భారత మాజీ ఆటగాడు ఇక ఇప్పుడు యూఏఈ జట్టుకు హెడ్ కోచ్గా మారిపోయాడు అన్నది తెలుస్తోంది.

 ఇటీవల యూఏఈ జట్టుకు హెడ్ కోచ్ పదవీ బాధ్యతలను చేపట్టాడు భారత మాజీ క్రికెటర్ లాల్చంద్ రాజ్ పుత్. ఆయన మూడేళ్ల పాటు ఆ జట్టుకు కోచ్గా సేవలు అందించబోతున్నాడు. త్వరలోనే రాజ్ పుత్ ఇక జట్టుతో చేరబోతున్నాడు అన్నది తెలుస్తుంది. కాగా అతను టీమిండియా తరఫున రెండు టెస్టులు నాలుగు వన్డే మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు అని చెప్పాలి. ఇక ఆయన 2016-17 మధ్య ఆఫ్గనిస్తాన్ జట్టుకు కోచ్గా వ్యవహరించారు. ఆయన కోచ్గా ఉన్నప్పుడే ఆ జట్టుకు ఇక టెస్ట్ హోదా దక్కింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత జింబాబ్వే జట్టుకు కూడా కోచ్గా పనిచేశారు ఆయన. ఇక ఇప్పుడు అతని కోచింగ్ లో యూఏఈ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: